amp pages | Sakshi

కాళ్లకు చెప్పులు లేవ్‌.. ‘కుటుంబం ఆకలి తీర్చాలిగా!’

Published on Fri, 09/30/2022 - 16:26

వైరల్‌: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్‌ మీడియాలోనూ అదే తరహా కంటెంట్‌పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్‌లు/ఏజెంట్‌ల గురించి రకరకాల కథనాలు వైరల్‌ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్‌ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం.

తారిఖ్‌ ఖాన్‌ అనే వ్యక్తి.. లింకెడ్‌ఇన్‌లో ఈమధ్య ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. ఎలివేటర్‌లో ఉండగా ఓ ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్‌ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్‌? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్‌ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్‌. 

అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్‌. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్‌. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్‌ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్‌ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.  కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్‌ ఖాన్‌ లింకెడ్‌ఇన్‌లో ఆ పోస్ట్‌ షేర్‌ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు. 

సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్‌ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్‌. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్‌ పేటీఎం నెంబర్‌ ఇస్తానని చెప్పాడు తారిఖ్‌. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)