amp pages | Sakshi

డబ్బులు అడిగితే కొట్టుడు ఏంది?: వైరల్‌ వీడియో

Published on Mon, 08/23/2021 - 19:43

లక్నో: ఆటోలో ప్రయాణించినంత సేపు ప్రయాణించి డబ్బులు అడగ్గా కొంత ఇచ్చేసి మిగతా ఇవ్వను అని ఓ మహిళా ప్రయాణికురాలు తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో డ్రైవర్‌కు ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సహనం కోల్పోయిన ఆ మహిళ చెప్పు తీసుకుని ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అంతకుముందు చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో నడిబొడ్డున జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
(చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు

లక్నో టెది పులియా ప్రధాన చౌరస్తాలో ఆగస్ట్‌ 21వ తేదీన ఈ ఘటన జరిగింది. వారి వివరాలు తెలియలేదు. కానీ ఆటో డ్రైవర్‌ ఒకచోట ఆ మహిళతో పాటు ఆమెకు సంబంధించిన ఇద్దరు యువకులను ఎక్కించుకున్నాడు. టెది పులియాకు చేరుకోవడంతో డ్రైవర్‌ డబ్బులు అడిగాడు. ఆమె సగం చెల్లించి వెళ్తుండగా ఆటో డ్రైవర్‌ మిగతా డబ్బు అడగ్గా ఆ మహిళ దుర్బాషలాడింది. ఆమె బూతు పురాణం కూడా మొదలుపెట్టడంతో సరిగ్గా మాట్లాడాలి ఆటో డ్రైవర్‌ చెప్పాడు. అనంతరం ఆమెతో వచ్చిన ఇద్దరు యువకులు అతడితో గొడవకు దిగారు. 

ఈ విషయాన్ని అక్కడ సమీపంలో ఉన్న పోలీస్‌కు ఆటో డ్రైవర్‌ ఫిర్యాదు చేశాడు. పోలీస్‌ వచ్చి మాట్లాడుతుండగా రెచ్చిపోయిన ఆ మహిళ డ్రైవర్‌ను మొదట చెంపపై కొట్టింది. అనంతరం చెప్పు తీసి అతడిపై దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు చేరలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. ఆమె తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు అడిగితే కొట్టుడు ఏంది? అని ప్రశ్నిస్తున్నారు.

చదవండి: ‘అమ్మాయిలూ ‘జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)