amp pages | Sakshi

భారత నౌక దళానికి కొత్త బలం ‘వగీర్‌’

Published on Thu, 11/12/2020 - 17:18

ముంబై: ఇండియన్‌ నౌక దళానికి కొత్త శక్తి తోడైంది. ప్రాజెక్ట్‌ 75లో భాగంగా తయారు చేసిన  5వ శ్రేణి స్కార్పిన్‌ జలంతర్గామి ‘వగీర్‌’ని నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అరేబియా సముద్రంలోని మజగావ్‌ డాక్‌ వద్ద రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్‌ నాయక్‌ వీడియో కాన్సరెన్స్‌ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఫ్రెంచి నౌక రక్షణ సంస్ధ డీసీఎన్‌ఎస్‌ భాగస్వామ్యంతో భారత నౌక దళ ప్రాజెక్ట్‌-75లో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ ఈ వగీర్‌ జలంతర్గామిని నిర్మించింది. భారత నౌక దళ అవసరాలకు అనుగుణంగా ఆరు స్కార్పిన్‌ జలంతర్గాములను నిర్మించడానికి మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌కు బాధ్యతలను అప్పగించింది. వీటిలో ఐఎన్‌ఎస్‌ కల్వరీని 2015లో మొదట ప్రారంభించగా, 2017 నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఖాందేరీ, కరంజ్‌, వేలా జలంతర్గాములను ప్రారంభించారు. (చదవండి:మలబార్‌ డ్రిల్‌లో ఆస్ట్రేలియా )

‘వగీర్’‌ సేవలను వచ్చే సంవత్సరం నుంచి ఉపయోగించుకోవచ్చునని పశ్చిమ నౌక దళ వైస్‌ ఆడ్మిరల్‌ ఆర్‌బి పండిట్‌ అన్నారు. ‘ఇప్పటికే ఉన్న రెండు కల్వరీ జలంతర్గాములు చురుగ్గా పని చేస్తున్నాయి. మిగిలిన నాలుగు కూడా ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని’ ఆయన అన్నారు. ఈ రకం జలంతర్గాములు భూమిపైన, లోపల జరిగే యుద్ధాలలో సేవలు అందిచడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దేశాన్ని ముందుకు నడిపించే యుద్ధ నౌకల నిర్మాణంలో మజగావ్‌ డాక్‌ సంస్థ ముందుంటుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ గోదావరి యుద్ధ నౌకలు, రేస్‌ కార్లు, మిసైల్‌ బోట్స్‌ ఇతరేతర శత్రు వినాశనిలను తయారు చేసింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)