amp pages | Sakshi

అప్పగింతల వేళ వెక్కివెక్కి ఏడ్చిన పెండ్లి పిలగాడు

Published on Tue, 09/28/2021 - 19:52

వివాహ వ్యవస్థకు మన సమాజంలో చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లి వేడుక అంటే మన దగ్గర ఎంత లేదన్నా.. మూడు, నాలుగు రోజలు పాటు కొనసాగుతుంది. ఇక పెళ్లి ఇంట్లో సరదాలు, సందళ్లకు కొదవే ఉండదు. అయితే కాలంతో పాటుగా పెళ్లిలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాల్లో చోటు చేసుకుంటున్న వెరైటీ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

సాధారణంగా పెళ్లి తర్వాత జరిగే అప్పగింతల వేడుకల సమయంలో వధువు ఏడుస్తుంది. కన్నవారిని.. తోబుట్టువులను.. స్నేహితులను వదిలి.. పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్తున్న వేళ.. ఆడపిల్లలు ఏడవడం సహజం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అప్పగింతల వేళ​.. వధువు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అందరికి వీడ్కోలు పలుకుతుండగా.. వరుడు మాత్రం.. కన్నీరు పెట్టుకుంటాడు. అది గమనించిన వధువు.. అతడిని తట్టి.. ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది.
(చదవండి: ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే)

కన్నీరు పెడుతున్న పెండ్లి కుమారుడిని చూసి అక్కడున్నవారంతా నవ్వుతారు. ఇక పెళ్లి కుమార్తె అతడిని చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత అతడు కూడా కళ్లు తుడుచుకుని.. నవ్వుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘ఇతగాడికి పెళ్లైన మొదటి రోజునే ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుందో అర్థం అయినట్లుంది’’.. ‘‘ఇంత బాగా ఏడ్చే పెళ్లి కుమారుడిని నేను ఇంతవరకు చూడలేదు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: ప్రీవెడ్డింగ్‌ షూట్‌ కల్చర్‌: పెళ్లింత.. తుళ్లింత

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌