amp pages | Sakshi

హైవేపై లారీ నడిపిన మహిళ.. స్మైల్‌కు ఫిదా అవుతున్న నెటిజన్స్‌

Published on Mon, 07/18/2022 - 15:45

Woman Driving Truck Video Viral: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. మగవారికి సమానంగా తాము సత్తా చాటగలమని నిరూపిస్తున్నారురు. భూమినుంచి అంతరిక‌్షం వరకు ఎందులోనూ తీసిపోమంటూని ముందుకు సాగుతున్నారు. ఆటో, బస్సు డ్రైవర్లుగానూ రాణిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ లారీ డ్రైవర్‌ అవతారమెత్తింది. ముఖంపై చిరునవ్వు చిందిస్తూ మహిళ లారీ డ్రైవ్‌ చేస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‎గా మారింది.

ఓ పెద్ద లారీని మహిళ హైవేపై ఎంతో కాన్ఫిడెంట్‌గా డ్రైవింగ్‌ చేస్తోంది. ఆమె మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న క్రమంలో ఆ వాహనంలోని వ్యక్తి మహిళను చూసి ఆశ్చర్యపోతూ వీడియో రికార్డ్‌ చేశారు. ఈ సమయంలో మహిళ సరదాగా నవ్వడం కెమెరా కంటికి చిక్కింది. అలా నవ్వుతూ ఆమె ఏమాత్రం బెదురు లేకుండా లారీ నడుపుతూ దూసుకెళ్లింది. దీనిని అవినాష్‌ శరణ్‌ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌  ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు.

సోషల్‌ మీడియోలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.94లక‌్షల మంది వీక్షించారు. దాదాపుగా 11వేలకు పైగా లైకులు వచ్చాయి.  వీడియోను చూసిన నెటిజన్స్‌ మహిళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె ఇప్పుడు మహిళలకు రోల్ మోడల్ అంటున్నారు నెటిజన్లు.. ‘ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆ చిరునవ్వు అద్భుతం, ఇన్సిరేషనల్‌, మీ కాన్ఫిడెన్స్‌ కి హ్యాట్సాఫ్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: హెల్మెట్‌ ధరించి బస్సు డ్రైవింగ్‌.. కారణం తెలిస్తే షాక్‌!

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?