amp pages | Sakshi

మహీంద్రా షోరూంలో చోరీ

Published on Wed, 11/15/2023 - 00:44

నిజామాబాద్: మండలంలోని బర్ధిపూర్‌ శివారులోని మహీంద్ర షోరూంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ చోరీ వివరాలు సీఐ కె.కృష్ణ తెలిపిన ప్రకారం.. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా ఆదివారం అర్ధరాత్రి ముఖాలకు మాస్కులు ధరించిన నలుగురు దొంగలు షోరూం వెనుకవైపు కిటీకి తొలగించి లోపలికి ప్రవేశించారు. షోరూంలోని అన్ని గదులు తిరిగి కౌంటర్‌లోఉన్న రూ.82వేలు, ఒక ట్యాబ్‌, సెల్‌ఫోన్‌ దొంగిలించారు.

అనంతరం నగదు లాకర్‌ను ఎత్తుకెళ్లారు. అయితే లాకర్‌ వంద కేజీల బరువు ఉండటంతో దానిని దూరంగా తీసుకెళ్లలేకపోయారు. షోరూం వెనుక ఉన్న చెత్తకుప్ప కింద దాచిపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గమనించిన సెక్యూరీటీ సిబ్బంది షోరూం మేనేజర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు తెలిపారు. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్‌ సిబ్బందితో షోరూంను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

శనివారం రాత్రి క్యాషియర్‌ దినేశ్‌ రూ.4లక్షల 80 వేల నగదును లాకర్‌లో భద్రపరిచి వెళ్లాడని ఆ లాకర్‌తోపాటు చిన్న లాకర్‌లో దాచిన రూ.82వేలు చోరీకి గురైనట్లు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సీసీటీవీ పుటేజీలు పరిశీలించగా లాకర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు కొద్ది సేపటికి ఖాళీ చేతులతో రోడ్డుపైకి రావడాన్ని గమనించారు. దీంతో షోరూం వెనుక ఉన్న ప్రతిఅంగుళాన్ని పరిశీలించారు.

సీఐ కృష్ణ ట్రాక్టర్‌ను తెప్పించి చెత్త కుప్పను తొలగించడంతో దానికింద ఉంచిన లాకర్‌ బయటపడింది. అందులోని డబ్బును పోలీసుల సమక్షంలో లెక్కించగా రూ.4.80 లక్షల నగదు అలాగే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం ఏసీపీ కిరణ్‌కుమార్‌ షోరూంను సందర్శించి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Videos

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?