amp pages | Sakshi

కరోనా పేరు చెప్పి విమానం ఎక్కనివ్వరా ? హైకోర్టులో ఎన్నారై ఫైట్‌!

Published on Fri, 02/04/2022 - 19:40

కరోనా వచ్చింది మొదలు జాగ్రత్తలు మొదలు , టెస్టుల, చికిత్సా విధానం వరకు నిబంధనల్లో బోలెడు వైరుధ్యాలు ఉన్నాయి. చాలా మంది వీటిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. కానీ ఓ ఎన్నారై మాత్రం కరోనా టెస్టుల్లో డొల్లతనం.. దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏవియేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఐసీఎంఆర్‌ల పనితీరుని నేరుగా ప్రశ్నించాడు.

అబుదాబీకి పయణం
కేరళాకి చెందిన ముజామిల్‌ వరికొట్టిల్‌ (29) అనే యువకుడు పదేళ్లుగా అబుదాబీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని సంపాదనపైనే ఇండియాలో కుటుంబం ఆధారపడి ఉంది. కాగా నాలుగు నెలల క్రితం ముజామిల్‌ కేరళా వచ్చాడు. తిరిగి అబుదాబీ వెళ్లేందుకు టిక్కెట్టు బుక్‌ చేసుకున్నాడు. 2022 జనవరి 29న కోజికోడ్‌ నుంచి దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కేందుకు అతను ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు.

చిక్కొచ్చి పడింది
ఎయిర్‌పోర్ట్‌ అధికారులు కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా ముజామిల్‌ని ఆదేశించారు. ప్రయాణానికి రెండు రోజుల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించిన కరోనా ఆర్టీ పీసీఆర్‌ నెగటివ్‌ సర్టిఫికేట్‌ చూపించినా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అంగీకరించలేదు. ఎయిర్‌పోర్టులో టెస్ట్‌ చేయించాల్సిందే అంటూ పట్టుబట్టారు. దీంతో రూ. 2,490 చెల్లించి ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ చేయించాడు. అప్పుడు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ముజామిల్‌ని ఫ్లైట్‌ ఎక్కనీయకుండా ఇంటికి పంపించేశారు.

హైకోర్టులో కేసు
ఫ్లైట్‌ మిస్‌ అవడం వల్ల అబుదాబీలో డ్రైవర్‌ ఉద్యోగాన్ని కోల్పోయాడు ముజామిల్‌. అంతేకాకుండా ఫ్లైట్‌ టిక్కెట్‌ కోసం ఖర్చు పెట్టిన రూ.15,000 వెనక్కి ఇచ్చేందుకు విమాన సంస్థ నిరాకరించింది. ఓ వైపు ఉద్యోగం పోవడం, మరోవైపు ఆర్థిక నష్టం కలగడంతో ముజామిల్‌ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోలేదు. వెంటనే తగు ఆధారాలతో కేరళా హైకోర్టును ఆశ్రయించాడు. అతను సమర్పించిన ఆధారాలు బలంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ఆర్యోగ శాఖలు, ఐసీఎంఆర్‌, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, కాలికట్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌లను ప్రతివాదులగా చేర్చుతూ కేసును విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు పంపింది.

ముజామిల్‌ లేవనెత్తిన కీలక అంశాలు
- ప్రయాణానికి రెండు రోజుల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు ఎందుకు అంగీకరించలేదు
- కోజికోడ్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్ట్‌ సెంటర్‌కి ఐసీఎంఆర్‌ నుంచి ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు. ఎటువంటి గుర్తింపు లేకుండా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ప్రైవేట్‌గా ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు.
- ప్రయాణానికి రెండు రోజుల ముందు, అంతకు ముందు చేసిన ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టులు ఐసీఎంఆర్‌ సైట్‌లో కనిపిస్తున్నాయి. కానీ ఎయిర్‌పోర్టులో చేసిన రిపోర్టులు కనిపించడం లేదు. 
- రెండు రోజులు ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్‌ నెగటీవ్‌ రిపోర్టు ఉండగా గుర్తింపు లేని ల్యాబ్‌ నుంచి మరోసారి ఎందుకు కోవిడ్‌ టెస్ట్‌ చేయించారు.
- నిబంధనలకు విరుద్ధంగా చేసిన టెస్ట్‌ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో పాటు ఆర్థిక నష్టం జరిగింది. కుటుంబానికి ఆర్థిక అండ లేకుండా పోయింది. అంతేకాదు ప్రయాణం చేయకుండా నా ప్రాథమిక హక్కును అడ్డుకున్నారు.

చదవండి: అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా..

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)