amp pages | Sakshi

అనుబంధాల ఆర్తనాదం

Published on Sun, 02/26/2023 - 01:12

మాజంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ, అనుమానం, వ్యామోహం ఈ విలువలను దిగజార్చేలా చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, కొన్నిచోట్ల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సైతం వివాహేతర సంబంధాల వల్ల విచ్ఛిన్నమవుతున్నాయి. హద్దులు దాటాక ఊహించని పరిణామాలు జరిగి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాలు, ఆస్తికోసం అడ్డు వస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచంలోనే ఆదర్శ కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం మనది. నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించి చేసుకున్న పెళ్లినాటి ప్రమాణాలు పటాపంచలవుతున్నాయి. ఫలితంగా ప్రాణంగా ప్రేమించిన వారు.. జీవితాంతం తోడుండాల్సిన వారే తోడేళ్లవుతున్నారు.

బంధం బలపడాలంటే..

  • దాంపత్యంలో దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి.
  • పొరపాట్లు జరిగినా.. అనుమానాలు.. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి.
  • భార్యాభర్తలు ప్రతిరోజు కొంత సమయం ఒకరికొకరు కేటాయించుకోవాలి.
  • బాధ్యతల్లో పడి ప్రేమించే వారిని ఒంటరిగా వదిలేయకూడదు.
  • మనస్పర్థలు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి.
  • ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా అపోహలు తొలిగే ప్రయత్నం రెండువైపులా జరగాలి.
  • ఎవరి తప్పు ఉందో తెలుసుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలి.
  • మరోమారు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి.
  • పిల్లల ముందు అస్సలు గొడవ పడరాదు.
  • ఎవరైనా మనసును ప్రభావితం చేస్తుంటే సున్నితంగా తిరస్కరించాలి.
  • తనకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యత ఉందని గుర్తెరగాలి.
  • వివాహేతర సంబంధాలు ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించాలి.

ఆదర్శమైన ఆ ఐదుగురు దంపతులు...

గుండె గుడిలో లక్ష్మీదేవి నిండిపోయి ఉంటుందని చాటుతూ వక్షస్థలంపై చోటిచ్చిన లక్ష్మీనారాయణుల్లా.. దేహంలో సగభాగం పార్వతీ అంటూ అర్ధనారీశ్వురుడైన గౌరీశంకరుల్లా.. దంపతుల ఇద్దరి మాట ఒకటేనంటూ సతీ సరస్వతిని నాలుకపై నిలిపిన బ్రహ్మదీసరస్వతుల్లా.. జీవకోటిని మేల్కొపుతూ పరుగులు పెట్టే భర్తను అనుసరించే భార్య ఛాయాదేవి, సూర్యుడిలా.. సర్దుకుపోయేతత్వం ఉన్న రోహిణిచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని అందంగా, ఆనందంగా తీర్చుదిద్దుకోవాలి. మొత్తం మీద భార్య నుంచి భర్తకు కావాల్సింది ఉపశమనం, సాంత్వన, పోషణ, కాని భార్యకు భర్త నుంచి కావాల్సింది అనుక్షణం సం‘రక్షణ’ ఒక్కటే. పెళ్లినాటి ప్రమాణాలు, నియమాలు, ఒప్పందాలను మర్చిపోకుండా మంచి సమాజం కోసం కుటుంబాన్ని ఆదర్శవంతంగా కొనసాగించినపుడే ఆ దాంపత్యంలో ఆనందం చిరస్థాయిగా ఉంటుంది.

నమ్మకంతో మెలగాలి

దంపతులు ఒకరిపై మరొకరు నమ్మకంతో మెలగాలి. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదు. సోషల్‌ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. వృత్తికి, కుటుంబానికి సమపాళ్లలో సమయం కేటాయించాలి. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం, భోజనం, అల్పాహారం కలిసి చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఒక రోజు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు కేటాయించడం ద్వారా అంతరాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది.

డాక్టర్‌ వడ్డాది వెంకటకిరణ్‌, మానసిక వ్యాధి వైద్య నిపుణుడు, జీజీహెచ్‌, గుంటూరు

#

Tags

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?