amp pages | Sakshi

సమస్యల పరిష్కారానికే ‘జగనన్నకు చెబుదాం’

Published on Thu, 11/09/2023 - 01:30

మాచవరం: క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికే జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, ఏడీఏ బి.శ్రీకృష్ణదేవరాయలు కార్యక్రమ నిర్వహణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి సమస్యనూ అందుబాటులో ఉన్న అధికారులే పరిష్కరించాలన్నారు. క్లిష్ట సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వస్తే పరిష్కార మార్గం చూపుతామన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సమస్యలపై అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులే వచ్చాయని, సుమారు 43 అర్జీలు వచ్చినట్లు ఎంపీడీఓ యు.బి.వరప్రసాద్‌ తెలిపారు.

ముఖ్యమైన అర్జీలు ఇవీ..

చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ అల్లాభక్షు కలెక్టర్‌కు విన్నవించారు. వేమవరంలో పులిచింతల ముంపు బాధితులకు పరిహారం అందేలా చూడాలని గ్రామస్తులు కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. ఓ కేసులో తనను రాజీ పడాలని పోలీసులు వేధిస్తున్నారని, బైక్‌ యాక్సిడెంట్‌ కేసులో తనకు అన్యాయం జరిగిందని మాచవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ అర్జీలన్నింటిపై విచారణ చేపట్టి పరిష్కరించాలని కలెక్టర్‌, జేసీ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాకాంత్‌ రెడ్డి, డీఎల్‌డీఓ గబ్రూ నాయక్‌, తహసీల్దార్‌ వరప్రసాద్‌, జెడ్పీటీసీ శివాయాదవ్‌, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ దారం లక్ష్మిరెడ్డి, వైస్‌ ఎంపీపీలు చింతపల్లి నన్నే, లక్ష్మయ్య, వైఎస్సార్‌ సీపీమండల కన్వీనర్‌ చౌదరి సింగరయ్య పాల్గొన్నారు.

కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)