amp pages | Sakshi

ముందే మాట్లాడుకుని పార్టీపై నిందలా?

Published on Wed, 02/01/2023 - 03:52

నెల్లూరు (సెంట్రల్‌)/ఒంగోలు సబర్బన్‌: తెలుగు­దేశం పార్టీలోకి వెళ్లేందుకు ముందుగానే చంద్రబా­బుతో మాట్లాడుకుని వైఎస్సార్‌సీపీపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిందలు వేయడం సరికాదని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. టీడీపీ వాళ్లతో మాట్లాడకుండా ఉంటే.. 2024లో రూరల్‌ నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తామని ఏ విధంగా చెప్పగలవని ప్రశ్నించారు. పార్టీ మారాలనుకుంటే వెళ్లవచ్చని, కానీ సొంత పార్టీపై నిందలు వేసి వెళ్లడం సరికాదని చెప్పారు.

ఆయన మంగళవారం నెల్లూరులోను, ఒంగోలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడి­యా­తో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌­రెడ్డి మూడురోజులుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటున్నారని చెప్పారు. కానీ రుజువులు చూపడం లేదన్నారు. ఏ ఆధారం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. మరో పార్టీ నాయకుడితో ఫోన్‌లో మాట్లాడుకుని, అది బయటకు రాగానే ఫోన్‌ ట్యాపింగ్‌ అంటారా? అని ప్రశ్నించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ, మీడియాకు లీకులిస్తున్న కోటంరెడ్డి.. ట్యాపింగ్‌ జరుగుతోందని ఎప్పుడైనా సీఎం వైఎస్‌ జగన్‌కు చెప్పారా అని అడిగారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయవల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు.  ఎవరు ఉన్నా లేకు­న్నా పార్టీ స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)