amp pages | Sakshi

దాడులకు భయపడొద్దు..  కొట్లాట ఆపొద్దు

Published on Mon, 03/21/2022 - 02:28

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక టీఆర్‌ఎస్‌ నేతలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముంది. భయపెట్టేందుకు కేసులు కూడా నమోదు చేయొచ్చు. ఎవరూ భయపడొద్దు. బీజేపీకి అధికారం ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ వచ్చే అవకాశం లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అన్నింటికీ సిద్ధంకండి. తెగించి కొట్లాడండి. మీకు అండగా పార్టీ నాయకత్వం ఉంది. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్ని కలు ఎప్పుడైనా రావచ్చు. అందుకు తగ్గట్లుగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి. స్థానిక సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలను ఉధృతం చేయండి’ అని సూచించారు. ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జరి గిన జిల్లాల అధ్యక్షుల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలోని లుకలుకలపై ప్రజల్లో చర్చ జరగకుండా దారి మళ్లిం చేందుకు కేసీ ఆర్‌ ఉద్యోగాల భర్తీ, ధాన్యం కొనుగోలు పేరుతో రోజుకో డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

బీజేపీపై ప్రజలు సానుకూలం
‘ప్రజలు టీఆర్‌ఎస్‌ పాలనపట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీజేపీపట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో పార్టీకి అనుకూ లంగా మార్చుకోవాలి’ అని సంజయ్‌ అన్నారు. ‘ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికివ్వాలనే విషయాన్ని జాతీ య నాయకత్వం చూసుకుంటుంది. గెలిచే చాన్స్‌ ఉన్న వాళ్లకే టికెట్లు వస్తాయి. టికెట్లు ఆశిస్తున్న నాయకులు అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’ అని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతితోపాటు మంత్రి శ్రీనివాస్‌ , వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

14 నుంచి  సంజయ్‌ రెండో విడతపాదయాత్ర
వచ్చే నెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్రకు పార్టీ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారం భించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  25 రోజులపాటు మొత్తం 400 కి.మీ. పాదయాత్ర నిర్వహించను న్నారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద æపూజ లు నిర్వహించి, ఆలంపూర్‌ లేదా గద్వాలలో సంగ్రామయాత్ర సభ నిర్వహించాలని భావిస్తు న్నారు. పాదయాత్ర ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆహ్వానించనున్నారు.   

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)