amp pages | Sakshi

రైతుల కోసం ఎందాకైనా వస్తా: బండి సంజయ్‌

Published on Tue, 11/16/2021 - 04:18

సాక్షి నల్లగొండ జిల్లా నెట్‌వర్క్‌:  ‘ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌లోనే ఉంటే ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి? 60 లక్షల టన్నుల ధాన్యం తీసుకుంటామని కేంద్రం చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప టికీ 7 లక్షల టన్నులే కొనుగోలు చేసింది. కేంద్రం ప్రకటించిన రూ.1,960 మద్దతు ధర రైతులకు దక్కకుండా వ్యాపారులకు వంతపాడుతోంది. మీరే ధాన్యం కొంటే కొనుగోలు కేంద్రాల్లో నాకేం పని. రైతుల కోసం ఎందాకైనా.. ఎంతవరకైనా వస్తా. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని జైలుకు పంపండం పక్కా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి వద్ద, తిప్పర్తిలో, మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను.. వేములపల్లి మండలం శెట్టిపాలెం పరిధిలోని రైస్‌మిల్లు వద్ద పరిస్థితిని పరిశీలించారు. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు
ఆయన మాటల్లోనే.. 

ధాన్యం కొనేదెప్పుడు? 
‘చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్‌.. నేడు ధాన్యం కొనబోమని చెప్ప డం దుర్మార్గం. నా కొడకా నీ కొడకా అని మాట్లాడడం కాదు. ఆరు ముక్కలుగా నరుకుతా అన్నావు.. ఎప్పుడో చెప్పు.. నేనే వస్తా.. నీ రాళ్ల దెబ్బలకు వెనుకడుగు వేయం. వడ్లు, పత్తి, మక్కలు, కం దులు కేంద్రమే కొంటుంది. నువ్వు కొనుగోలు చేయకుండా ఏం పొడుస్తున్నావ్‌..? లక్ష కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొంటున్నామని ఒక మంత్రి చెప్తున్నారు. ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని మరో మంత్రి అంటున్నారు. గతేడాది కోటీ 40లక్షల టన్నుల ధాన్యం కొన్నామంటున్నారు. మరి ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలే సరిగా ప్రారంభించలేదు. ఇక ధాన్యం కొనేదెప్పుడు? ధాన్యం కోసం బస్తాలు, హమాలీ ఖర్చులతోపాటు అన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. పైగా ధాన్యం కొనుగోలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 2శాతం కమిషన్‌ కూడా ఇస్తుంది. అయినా కొనకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారు? 

యాసంగిలో వరి వేయండి 
యాసంగిలో వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులపై రైతులు ఆందోళన పడొద్దు. ఎలాంటి అనుమానాలూ లేకుండా వరి సాగు చేయండి. కేంద్రమే కొంటుంది. వచ్చే ఏడాది వరికి మద్దతు ధర పెంచుతాం. రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు.  

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)