amp pages | Sakshi

TS: బీఎస్పీకి కంచుకోట ఉందా? అక్కడి నుంచే ప్రవీణ్ కుమార్ పోటీ!

Published on Sat, 01/07/2023 - 21:12

ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్‌కుమార్‌ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్‌ పర్యటన ఎన్నికల యాత్రేనా? 

కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో‌ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్  కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను  ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్‌‌ నిర్వహిస్తున్నారు.

ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు  వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను  కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం‌ చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. 

గుడ్బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్‌ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా  ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల  గెలుపు ఓటములను  ప్రభావితం చేస్తాయి.

పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్‌ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్.  ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్‌సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. 

ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)