amp pages | Sakshi

అమరావతిలోనూ ఓడించారు

Published on Wed, 03/10/2021 - 03:18

తాడికొండ: తాను అమరావతిని రాజధాని చేస్తే, ఈ ప్రాంతంలోనూ ప్రజలు టీడీపీని ఓడించారని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ వైఎస్సార్‌సీపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని.  ప్రజలు అక్కడా ఓడించారని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్ద మహిళా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల భవిష్యత్తు అవసరాల కోసమే రాజధాని నిర్మాణం అని, 5 కోట్ల ఆంధ్రులు ఏకమై ఉద్యమించాలని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ఉద్యమం అమరావతి ఉద్యమం అని, చరిత్రలో ఇది నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు, పన్నుల పెంపుతో బాదుడే బాదుడు జరుగుతోందని, రూ.10 వేలు ఇచ్చి రూ.లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశావ్‌.. నేను కన్నెర్రజేస్తే నువ్వు బయటకు రాలేవు’ అంటూ సీఎంపై మండిపడ్డారు.  

ఎక్కడ పని చేస్తున్నా పోలీసులను వదలను 
పోలీసులు చాలా ఎక్కువ చేస్తున్నారని, అన్నీ రికార్డు చేస్తున్నానని.. తర్వాత రికవరీ చేస్తానని హెచ్చరించారు. ఎక్కడ డ్యూటీలు చేస్తున్నా మిమ్మల్ని వదలనంటూ బెదిరింపులకు దిగారు.  ఎంపీ గల్లా జయదేవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్, అమరావతి జేఏసీ కన్వీనర్‌ శివారెడ్డి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)