amp pages | Sakshi

టీడీపీలో మహిళలకు గౌరవం లేదు

Published on Thu, 06/02/2022 - 16:02

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడతూర్పు): ‘నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అచ్చెన్నాయుడి మాదిరిగా పార్టీ లేదు బొక్కా లేదు అనలేదు. సాధినేని యామినిలా విమర్శలు చేయలేదు. నారీభేరీకి డబ్బులు తీసుకుని మేకప్‌ వేసుకుని కూర్చోలేదు. ఇప్పుడు నన్ను తప్పుబడుతున్న వాళ్లు అచ్చెన్నని ఏం శిక్షించారు. టీడీ జనార్దన్‌ను ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఏడాది కాలంగా నన్ను అవమానించి నరకం చూపించారు. గౌరవం లేనిచోట ఉండలేను. అందుకే టీడీపీకి రాజీనామా చేసి ఆ లేఖను పార్టీకి పంపుతున్నా..’ అని సినీనటి దివ్యవాణి చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం గురువారం విజయవాడలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని చాలామంది చెప్పినా వినలేదని, వారు చెప్పినట్టే పార్టీలో తనకు అన్యాయం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా తనకు ప్రాధాన్యత లేకపోవడానికి దారితీసిన కారణాలను వివరించిన దివ్యవాణి టీడీపీ నేతల తీరుపై సంచలన కామెంట్లు చేశారు. దివ్యవాణి ఇంకా ఏమన్నారంటే.. 

పార్టీ కోసం బాలకృష్ణకంటే నేనే ఎక్కువ పనిచేశా
మత మార్పిళ్లపై చంద్రబాబు చేసిన కామెంట్ల వల్ల క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. నిజం మాట్లాడినందుకు నన్ను టార్గెట్‌ చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే ఆయనకంటే ముందు నేనే కౌంటర్‌ ఇచ్చాను. ఈ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ పార్టీలో జరుగుతున్నవి చెబితే టీడీపీ నేతలే నన్ను టార్గెట్‌ చేసి ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడలేదు. చంద్రబాబు చుట్టూ దొంగలున్నారు. వాళ్లంతా చంద్రబాబుతో మాట్లాడనివ్వలేదు. చంద్రబాబు పీఏ రాజగోపాల్‌ చాలాసార్లు అవమానించాడు.

పార్టీలో ఏం జరుగుతున్నదీ లోకేశ్‌కు చెబితే ఆయన టీడీ జనార్దన్‌కు చెప్పమన్నారు. చంద్రబాబుకు కళ్లు, ముక్కు, చెవులు అంతా తానై వ్యవహరించే జనార్దన్‌ నన్ను చాలాసార్లు అవమానించాడు. జనార్దన్‌ను ప్రశ్నించినందుకు నరకం చూపించారు. పార్టీకోసం బాలకృష్ణ కంటే నేనే ఎక్కువగా పనిచేశాను. బాలకృష్ణ ఏనాడైనా అమరావతిలో బిడ్డల దగ్గరకు వచ్చారా? కరోనా టైమ్‌లో నేను నా కుటుంబాన్ని వదిలి అమరావతికి వచ్చి పార్టీకోసం పనిచేశాను. మహానాడులో ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం తీర్మానం చేయలేదు. అన్ని జిల్లాల్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేదు. మహానాడులో గ్రీష్మ అలా మగాళ్ల దగ్గర తొడగొట్టడం మంచి పద్ధతి కాదు.

అనితకు డబ్బులిచ్చి మేకప్‌ వేయించి నారీభేరీ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌ పెట్టడానికి నలుగురి దగ్గరకి తిప్పేవారు. నన్ను కుక్కపిల్లలా ఆడుకున్నారు. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్‌మీట్‌ పెట్టించారు. నాలాగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. టీడీపీలో ఆడవాళ్లకు అవకాశాలు రావాలంటే ఆ నలుగురి చుట్టూ తిరగాలి. ఆ నలుగురికి ఏం కావాలంటే అది చేస్తేనే పదవులు.

అందుకే టీడీపీ నుంచి జయసుధ, జయప్రద బాధతో వెళ్లిపోయారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని నన్నపనేని రాజకుమారి నాకు స్వయంగా ఫోన్‌చేసి ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించాను. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. నాకు ఇలాంటిరోజు వస్తుందని భావించలేదు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా? కొందరు ఇడియట్స్‌ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. 

పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా అన్నారు.. 
పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా? వైఎస్సార్‌సీపీలో అయితే బాగుంటుంది. వైఎస్సార్‌సీపీలో నమ్మినవారికి ద్రోహం జరగదని ఎంతోమంది శ్రేయోభిలాషులు చెప్పినా వినకుండా టీడీపీలో చేరాను. మూడున్నరేళ్లుగా టీడీపీకి సేవలు చేశాను. టీడీపీలో ఉన్నందుకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా పోయాయి. నా నోటికాడ భోజనం పోయింది. అది కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేశాను. చంద్రబాబు కోసం మోదీపైన విమర్శలు చేశాను.
చదవండి: చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా?: దివ్యవాణి 

ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ బతకాలంటే ధైర్యంగా బయటకు రావాలి
ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ బతకాలంటే తనలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి టీడీపీలో జరుగుతున్నది ఏమిటో నిజాలు చెప్పాలి. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన కొడుక్కి ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌పై అభిమానంతో మాట్లాడుతుంటారు. అటువంటి ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయి. వాటిని పిల్లల దశలోనే చంపకపోతే అందర్నీ కాటేస్తాయనే ఆవేదనతో గుండె పగిలి ఈ నిర్ణయం తీసుకున్నా.. అని దివ్యవాణి చెప్పారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. 

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)