amp pages | Sakshi

Womens Reservation Bill 2023: ఓబీసీలపై కాంగ్రెస్‌ సవతి ప్రేమ

Published on Fri, 09/22/2023 - 05:51

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఓబీసీ కోటా కూడా కలి్పంచాలన్న కాంగ్రెస్‌ పార్టిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దుమ్మెత్తిపోశారు. వారిపై కాంగ్రెస్‌ ప్రేమ మాటలకే పరిమితమన్నారు. అధికారంలో ఉండగా ఓబీసీలకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేకపోగా కనీసం వారి గురించి ఆలోచించను కూడా లేదని ఎద్దేవా చేశారు.

నరేంద్ర మోదీ రూపంలో దేశానికి తొలి ఓబీసీ పీఎంను ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళా బిల్లుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని అన్ని పార్టిల ఎంపీలను కోరారు. బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించడం తెలిసిందే.

రాహుల్‌ ది ట్యూటర్‌ తెలివిడి
2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ కూటమి పాలనలో కేంద్రంలో ఎందరు ఓబీసీ కార్యదర్శులున్నారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. సరీ్వసుల్లో ఉన్న అధికారులకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లను కేవలం 1992లో సుప్రీంకోర్టు సూచన అనంతరం మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరోపణలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ట్యూటర్లను పెట్టుకుంటే చాలదు.

నాయకుడు కావాలంటే చిత్తశుద్ధితో అందుకోసం ప్రయతి్నంచాలి‘ అంటూ ఎద్దేవా చేశారు. ‘303 మంది బీజేపీ లోక్‌ సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. ఇది కాంగ్రెస్‌ మొత్తం సభ్యుల కంటే కూడా చాలా ఎక్కువ! దేశవ్యాప్తంగా మా పార్టికి ఉన్న ఎమ్మెల్యేల్లో 27 శాతం, ఎమ్మెల్సీల్లో ఏకంగా 40 శాతం ఓబీసీలే. మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ మాత్రం కేవలం మైనారిటీల సంతుష్టికరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలను లేవనెత్తుతూ ఉంటుంది‘ అని నడ్డా అన్నారు.

రాజకీయ లబ్ధి కోసం కాదు
మహిళా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను నడ్డా తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడచుకుంటుందన్నారు. మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందడం బీజేపీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్నదే సరైన, అత్యంత దగ్గర విధానమని చెప్పారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావల్‌ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం లాంఛనమేమని భావి స్తున్నారు. అనంతరం మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన గణన గణాంకాల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.  

వాగ్వాదం
రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వా గ్వాదం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. బిల్లు అమలు కాలావధిపై విపక్షాల విమర్శలను నడ్డా విమర్శించడం ఇందుకు దారితీసింది. ఖర్గే జోక్యం చేసుకుంటూ, బీజేపీకి దమ్ముంటే రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని సవాలు చేశారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా అభిమానుల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)