amp pages | Sakshi

నేనూ ఏదో ఒకరోజు సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Published on Tue, 11/07/2023 - 16:31

సాక్షి, నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ ఊపందుకుంది. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువుండటంతో అన్నీ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. మరోవైపు కీలక పార్టీ అభ్యర్థులతోపాటు రెబల్స్‌, స్వతంత్రులు.. ఇలా ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో దూసుకున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నల్గొండ అసెంబ్లీ స్థానానికి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో  మాయమాటలు చెప్పి బీఆర్‌ఎస్‌ గెలిచిందని విమర్శించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను భర్తీలో చేయటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతలు నల్గొండను నాశనం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. పోలింగ్‌కు ముందు రైతు బంధు వేస్తారని, దానితో మోసపోవద్దని సూచించారు. డిసెంబర్‌ 9 కాంగ్రెస్‌కు లక్కీ నెంబర్‌ అని పేర్కొన్నారు. సోనియా పుట్టిరోజు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ నుంచి తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతానని తెలిపారు. అయితే సీఎం కావాలనే తొందర మాత్రం తనకు లేదని చెప్పారు.
చదవండి: పంతం నెగ్గించుకున్న ఈటల, బండి సంజయ్

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)