amp pages | Sakshi

బాబు నిన్న చర్చించాడు.. నేడు అమలు చేశాడు: కొడాలి నాని

Published on Fri, 11/19/2021 - 16:02

సాక్షి, అమరావతి: అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయికాట్‌  హైడ్రామాపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఇదంతా ముందస్తుగా రచించుకున్న వ్యూహంలో భాగమే. ఇకపై అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలనేది గురువారం సాయంత్రమే పార్టీ నేతలతో చర్చించుకొని దానిని యథాప్రకారంగా నేడు అమలు చేశారు. ఈ విషయంపై మాకు ముందస్తు సమాచారం ఉంది. 

మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా ఇప్పటిదాకా అదే విషయంపై మాట్లాడుతున్నా. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్నారు అని బొత్స సత్యనారాయణ నాతో చెప్తున్నారు. అంతలోనే చంద్రబాబు తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తూ సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ మొసలి కన్నీరు కారుస్తూ అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు. 

చదవండి: (ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు బాధ్యతలు) 

బాబు హయాంలో జరిగిన వంగవీటి మోహనరంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యల గురించి చర్చిద్దామంటే ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు వ్యవసాయశాఖ మీద చర్చ జరుగుతోంది. దాని గురించి మాట్లాడమంటే నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. నా భార్యను అవమానించారంటూ మాట్లాడటం ఏమైనా సంబంధం ఉందా?. అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనతోనే ఈ డ్రామా మొదలెట్టారు. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారే వ్యక్తి. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం బాబుది. చంద్రబాబు పదవి కోసం కుటుంబ సభ్యుల్ని కూడా పట్టించుకునే వ్యక్తి కాదు' అని మంత్రి కొడాలి నాని అన్నారు. 

చదవండి: (మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్‌)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌