amp pages | Sakshi

అమిత్‌షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ..

Published on Sat, 05/14/2022 - 14:17

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అమిత్‌షాకు 9 ప్రశ్నలను ఆయన సంధించారు. మోసానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ కవల పిల్లలు అంటూ లేఖలో మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని మీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మీ హామీ ఒట్టి బూటకం అని అర్థమైయిందని నిప్పులు చెరిగారు.
చదవండి: తెలంగాణ కడుపు కొడుతోంది!

లేఖలో రేవంత్‌ ఏమన్నారంటే?
‘‘అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి మీ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ లక్షలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు వదిలారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతుల నెత్తిన బరువు మోపింది మీ ప్రభుత్వం. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా మీ పాలనలో వ్యవసాయంలో గుణాత్మక మార్పు అన్నది జీరో.

ఇక తెలంగాణ విషయానికి వస్తే... బీజేపీ-టీఆర్ఎస్‌లు ఎనిమిదేళ్లు అంటకాగి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ ఇద్దరూ కలిసి విజయవంతంగా తుంగలో తొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడో సారి మీరు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్ డైలాగులే తప్ప తెలంగాణ ప్రజలు, రైతులు, యువత సమస్యల పరిష్కారానికి మీరు ఇచ్చిన మాట లేదు.. చేసిన పనీ లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతితో ఇప్పటికే వేల కోట్ల తెలంగాణ ప్రజల సంపద దోపిడీకి గురైతే.. మీరు చోద్యం చూస్తున్నారు. బొగ్గు స్కాం నుంచి భూముల స్కాం వరకు పలు ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదు.

ఇటీవల మీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. మీ పార్టీ రాష్ట్ర నాయకులేమో టీఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తోన్న మీ రెండు పార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో... 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న మీకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారింది అని... మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగింది అని అంగీకరిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దేశంలో ప్రతిపక్ష నేతలు, మీ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే మీరు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!?

తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీరు, కేసీఆర్ కలిసి మొదట ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు. యాసంగి (2022) నుండి తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రభుత్వం చేయకూడదు అన్నది ఆ ఒప్పందం. దానికి రైతుకు సంబంధం లేని బాయిల్డ్ రైస్ అని ఒక వంక తెర మీదకు తెచ్చారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. రైతుల వద్ద ధాన్యం కొంటుంటే ప్రభుత్వానికి రూ.7000 కోట్ల నష్టం వచ్చిందని కుంటి సాకులు చెప్పారు. వరి వేస్తే ఉరే అని హెచ్చరికలు చేశారు. వరి వేస్తే రైతు బంధు ఇవ్వబోమని సంకేతాలు పంపారు.

ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకారం తెలుపుతూ 2021 అక్టోబర్ 4న మీ ఆదేశాల మేరకే FCI కి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖపై క్షేత్ర స్థాయిలో "కల్లాల్లోకి కాంగ్రెస్" అని మేం పోరుబాట పట్టడంతో మాటమార్చారు. మీ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడచిన వానాకాలం నుండి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా!?

గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై టీఆర్ఎస్ మౌనందాల్చినా... కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. మీరు స్పందించ లేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా మీరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదు అని మీరు భావిస్తున్నారా!?

మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు మీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను చీట్ చేయడం కాదా!?

తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. తెలంగాణకు కేంద్రం పదే పదే రిక్తహస్తం చూపిస్తున్నా ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ మీరు అనేక సందర్బాల్లో మద్ధతిస్తూ వచ్చింది. ఇది బహిరంగమే. తెలంగాణ ప్రజలను నిలువునా వంచించిన మీ ఇద్దరినీ మేం ఎందుకు నమ్మాలి... మీకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు?

అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా "రామాయణం సర్క్యూట్"  పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ పేరిట రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కిలో మీటర్లు సాగే ఈ సర్క్యూట్ లో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు మొండి చెయ్యి చూపారు. దీనికి మీ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా!? అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా!?

ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై మా పార్టీ సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే... అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?

పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. అడగే బుద్ధి టీఆర్ఎస్ సర్కారుకు లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్ధతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్ధతు.. ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది!?

2014లో మేం అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.1052 ఎగబాకాయి. మీరు అధికారంలోకి వచ్చాక దశల వారిగా గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రతి రోజు ఉదయం పెట్రోలియం ధరల పెరుగుదల వార్తతోనే జనం జీవితాలు మొదలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ధరల పెరుగుదలతో జన చస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా? ఈ ధరల్లో 60 శాతం వరకు బీజేపీ - టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాదుతున్న పన్నులే ఉన్నాయి. మీరు తగ్గించాలని వారు, వారు తగ్గించాలని మీరు డ్రామాలు చేయడం తప్ప... ప్రజలకు ఇద్దరు కలిసి ఇస్తున్న ఉపశమనం శూన్యం. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?

అమిత్ షా గారూ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు తెలంగాణకు ఏ మొఖం పెట్టుకుని వస్తారు? మోసానికి కవల పిల్లలు లాంటి బీజేపీ - టీఆర్ఎస్ జిత్తులు, ఎత్తులు గ్రహించ లేని అమాయకులా తెలంగాణ ప్రజలు? మా ప్రజలకు ఒపిక ఎక్కువ... దానిని అమాయకత్వం అనుకుంటే పొరపాటు. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర పోరాటం వరకు ప్రపంచానికే పోరాట పంథాను చూపిన తెగువగల ప్రజలు మా వాళ్లు. సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదు’’ అంటూ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.


 

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)