amp pages | Sakshi

కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. పంజాబ్‌ మళ్లీ మాదే

Published on Thu, 02/10/2022 - 12:06

కాంగ్రెస్‌దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్‌పై విమర్శలు, భగవంత్‌ మాన్‌పై వ్యక్తిగత దాడి.. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు.

ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?  
జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్‌ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ  చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్‌ వర్క్‌ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం.  

ప్రశ్న : కాంగ్రెస్‌ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం?  
జవాబు: మాయావతి పంజాబ్‌లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ  శిరోమణి అకాలీదళ్‌ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు.  

ప్రశ్న : ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌ దూకుడుని అడ్డుకోగలరా ?  
జవాబు: అరవింద్‌ కేజ్రివాల్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు.  మొదట్లో ఆయన ఆబ్‌కీ బార్‌ కేజ్రివాల్‌ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్‌ మాన్‌ను తీసుకువచ్చారు. కేజ్రివాల్‌ కన్న కలలు పంజాబ్‌లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు.  

ప్రశ్న : భగవంత్‌ మన్‌ మీతో పోటీ పడగలరా ?  
జవాబు: భగవంత్‌ మన్‌ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్‌ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్‌ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది.

Videos

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?