amp pages | Sakshi

తెలంగాణ తీర్పును దేశం గమనిస్తోంది 

Published on Wed, 11/29/2023 - 04:58

సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్‌ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి పెంచినట్టే. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. పదో తేదీన రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగుల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

కేసీఆర్‌ ఓడినా, గెలిచినా ఫాంహౌస్‌లోనే పడుకుంటాడని, కామారెడ్డి ప్రజల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకే తాను వచ్చానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూంలు ఎంతమందికి ఇచ్చాడని, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. గజ్వేల్‌ను వదిలి సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ను తాత్కాలికంగా రద్దు చేసినా, ఎన్నికల తరువాత మళ్లీ తెరపైకి తెచ్చి భూములను లాక్కుంటారని వివరించారు. తెలంగాణ దశ, దిశను మార్చే తీర్పును దేశమంతా గమనిస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.పది వేలు ఇచ్చి, రూ.పదివేల కోట్ల విలువైన భూములు లాక్కుంటారని ఆరోపించారు.  

వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం.... 
పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చెప్పి వైశ్యులను మోసం చేశాడని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని రేవంత్‌ చెప్పారు. గల్ఫ్‌ కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వారికి అండగా ఉంటామని, కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అందరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

Videos

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)