amp pages | Sakshi

బాబు ‘అప్పు’డే  లెక్క తప్పారు

Published on Sat, 08/27/2022 - 03:47

సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవహారాల్లో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా పరిణమించాయి. అప్పట్లో బాబు ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక అవసరాలకు అడ్డు పడుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా చివరి మూడేళ్లు ఆ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. అందులోనూ కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు తెచ్చింది. అప్పట్లో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు, ఆయన తానా అంటే తందానా అనే దుష్ట చతుష్టయం అప్పులపై గగ్గోలు పెడుతున్నాయి. వీరి వ్యవహారంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి ఏకంగా రూ.17,932.94 కోట్లు ఎక్కువగా అప్పు చేసింది. బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పులు చేయరాదని 14వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ 3  శాతానికి లోపు అప్పులను పరిమితం చేయలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.95 శాతం నుంచి 4.52 శాతం వరకు ఎక్కువగా అప్పులు చేశారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పరిమితికి మించి ఏకంగా రూ.8,204.13 కోట్లు అప్పు చేసింది.

అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనేక సమయాల్లో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని చెప్పడం కూడా అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సర్దుబాటు చేస్తామని, ఆ మేర ఇప్పుడు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అప్పులను తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనల మేరకు, అనుమతి మేరకు తీసుకోవాల్సిన అప్పుల్లో కోతపడుతోంది. దీని ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

బాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులను ఇప్పటి అప్పుల్లో మినహాయిస్తే బడ్జెట్‌ వ్యయానికి కూడా నిధులు తగ్గిపోతాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన అప్పులను 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధిలోనే క్రమబద్ధీకరించాలని, 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.5 శాతం మేర అప్పులు చేయడానికి అనుమతి ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కారు చేసిన అధిక అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలా మారాయి. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)