amp pages | Sakshi

ఎందుకు దాడిచేశారో చెప్పాల్సింది

Published on Tue, 10/26/2021 - 04:57

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రధాన కార్యాలయంపై ఇటీవల దాడి ఎందుకు జరిగిందో ఆ పార్టీ నేతలు దాచి పెడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమైన చంద్రబాబు బృందం ఈ విషయాన్ని చెప్పాల్సిందని పేర్కొన్నారు. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కారణంగా సానుభూతి కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద కుట్రలో భాగంగానే టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని దూషించడానికి పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని, ఇందుకు చంద్రబాబు పార్టీ నేతల్ని ప్రేరేపిస్తున్నారని విజయసాయిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలో భాగంగా సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈనెల 19న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. ‘తాడేపల్లి ప్యాలెస్‌ (ముఖ్యమంత్రి అధికారిక నివాసం)లో కూర్చొన్న దద్దమ్మకు నేను చెబుతున్నా. నీకు దమ్ముంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇవ్వు బోసిడీకే. నీకు దమ్ముంటే గుంటూరు ఎస్పీకి నోటీసు ఇవ్వండి. పబ్‌జీ దొరా.. వేరే ఎవరికైనా నోటీసులు ఇవ్వు.. మాకు కాదు. బోసిడీకే మాపై కాదు.. స్మగ్లర్లపై చర్యలు తీసు కోవడానికి యత్నించు..’ అన్నారని వివరించారు.

టీడీపీ డర్టీ పాలిటిక్స్‌తో ప్రజల ఆగ్రహమే టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమని తెలిపారు. దాడి కి సంబంధించిన ఛాయాచిత్రాలు చూపించి సాను భూతి పొందడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ అధ్య క్షుడు చంద్రబాబు.. ప్రజలు ఎందుకు దాడిచేశారనే విషయంపై మౌనం వహిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు ఖం డించలేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న సీఎం, ఇతరులపై నీఛమైన వ్యాఖ్యలు చేయమని చంద్రబాబు పార్టీ నేతల్ని ప్రోత్సహిస్తు న్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతితో సమావేశ  మైనప్పుడు టీడీపీ కార్యాలయంపై ప్రజలు ఎందు కు దాడిచేశారో కూడా ప్రస్తావిస్తే బాగుండేదని తెలిపారు.

టీడీపీ అధికార ప్రతినిధి ప్రకటనల వీడియోలు చూస్తే పెద్ద కుట్రలో భాగంగానే తప్పు డు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్ప ష్టంగా రుజువవుతోందని తెలిపారు. అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టీడీపీ నేతల ప్రకటనలు రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ, మునిసిపాలిటీ, పంచాయతీ, స్థానిక సంస్థలకు సంబంధించి 2019 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా అధికారం పొందలేకపోయిందని గుర్తుచేశారు. అందుకే ఆర్టికల్‌ 356 అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వ్యవస్థను అణగదొక్కాలని కోరుకుంటోందని తెలిపారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)