amp pages | Sakshi

పేదల జీవితాల్లో వెలుగులు

Published on Sun, 10/29/2023 - 05:36

సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్రంలోని పేదల జీవితాల్లో ఇప్పుడే వెలుగులు చూస్తున్నామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషి ఫలితమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం బాపట్ల అంబేడ్కర్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును వివరించారు. ఈ సభలో మంత్రి రమేష్‌ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక ధర్మాన్ని పాటిస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేకూర్చారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బడుగు, బలహీనవర్గాలు సగర్వంగా సామాజిక సాధికార యాత్ర చేసే అవకాశం కల్పించారని తెలిపారు. కేబినేట్‌లో 15 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో భాగాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి లేరని అన్నారు.

రాజ్యసభ స్థానాలను చంద్రబాబు రూ.100 కోట్లకు అమ్ముకునే వారని, ఈ రోజున పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభ సభ్యులను చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతోందని వివరించారు. మోషేన్‌ రాజును శాసన మండలి చైర్మన్‌ను చేశారన్నారు. నెట్‌లో చూసి ఇంగ్లిష్‌ నేర్చుకోవచ్చంటున్న పవన్‌ కళ్యాణ్‌.. అతని పిల్లలకూ అలానే నేర్పుతారా అంటూ నిలదీశారు. ఈ యాత్రను లోకేశ్‌ గాలియాత్ర అంటున్నారని,  ఇది గాలియాత్ర కాదని, ప్రజా వ్యతిరేకులైన చంద్రబాబు అండ్‌ కోపై దండయాత్ర అని చెప్పారు. సాధికార యాత్రకు జనం లేరని రాధాకృష్ణ, రామోజీ, టీవీ 5 బీఆర్‌ నాయుడు ప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే వచ్చి ఈ యాత్రలకు ప్రభంజనంలా వస్తున్న ప్రజలను చూడాలని సవాల్‌ చేశారు. జగన్‌ కటవుట్‌ చూస్తేనే జనం ఇలా వస్తే.. జగనే స్వయంగా వస్తే బాపట్ల పట్టుద్దా అని అన్నారు. 

ప్రతి కుటుంబానికి లబ్ధి: ఎంపీ మోపిదేవి 
వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లబ్ధి పొందిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చేంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్‌ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు లభించాయని చెప్పారు. 

జగనన్న పాలనలో మహిళా ఆర్థికాభివృద్ధి 
సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళా సాధికారిత జగనన్న పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. భువనేశ్వరి ఏనాడూ మహిళల కోసం బయటకు రాలేదని, ఈ రోజు అవినీతి చేసి జైలుకు వెళ్లిన భర్త కోసం బయటకు వచ్చి డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. 

జగన్‌ పాలన దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే కోన రఘుపతి 
రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అందిస్తున్న పరిపాలన దేశానికే రోల్‌మోడల్‌గా ఉందని, దేశం మొత్తం మనవైపే చూస్తోందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెపాపరు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి జగనన్న ఆలోచిస్తున్నారన్నారు. పేదల గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. మనకు జిల్లాను ఇచి్చనందుకు, మెడికల్‌ కళాశాల ఇచ్చినందుకు తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్నారు.  

జగనన్నతోనే పేదల అభ్యున్నతి 
బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ పేద పిల్లల ఉచిత చదువుల కోసం, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం కోసం, రైతు భరోసా కోసం మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనుడు జగనన్న అని చెప్పారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అవహేళన చేస్తే.. వైఎస్‌ జగనన్న ఎస్సీలు  మేనమామలని అన్నారని గుర్తు చేశారు.

అమరావతి భూములతో చంద్రబాబు అవినీతి చేస్తే, ఆ భూములను పేదలకు పంచిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. చంద్రబాబు రూ.370 కోట్లు కాజేస్తే అది చిన్న అమౌంటేనని పవన్‌ చెప్పడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఎస్సీ, బీసీలను దొంగలని జైల్లో పెడితే జగనన్న ఢిల్లీలో కూర్చొపెట్టారని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు భయం పరిచయం చేస్తానని లోకేశ్‌ అంటున్నాడని, సోనియా గాంధీకే ఆయన భయపడలేదని, పిల్లకుంక లోకేశ్‌ ఎంత అని ఎద్దేవా చేశారు.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు