amp pages | Sakshi

'శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు'

Published on Sat, 09/24/2022 - 17:26

సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ఇదే రోజున టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. జోహన్స్‌ బర్గ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను ధోని సేన ముద్దాడింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా..  అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్‌ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని మరోసారి గుర్తుచేసుకునేందుకు స్టార్‌ స్పోర్ట్స్‌" ది రీయూనియన్ ఆఫ్ 07" అనే షోను నిర్వహించింది. ఈ షోలో తొలి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌లో తమ మధుర జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. 

శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు..
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడూతూ.. 2007 టీ20 ప్రపంచకప్‌ సమయంలో సోషల్‌ మీడియా లేదు. కానీ ఫైనల్లో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో తలపడడం అంత సులభం కాదని అంతా చర్చించుకున్నారు. నిజంగానే ఫైనల్లో మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.

ఫైనల్లో నా నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేసిన తర్వాత నేను చాలా అలసిపోయాను. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇంత అలసిపోలేదు. ఆ సమయంలో నాకు కొంచెం కూడా ఓపిక లేదు. ఇక ఈ మ్యాచ్‌లో  శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు, అతడు ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు’’అని పేర్కొన్నాడు.

రోహిత్‌ ఇన్నింగ్స్‌ చాలా కీలకం
ఇక రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ కోసం ఆర్పీ సింగ్‌ మాట్లాడూతూ.. రోహిత్‌ అడిన ఇన్నింగ్స్‌ చాలా కీలకంగా మారింది. మేము 18 ఓవర్లలో 130 పరుగులు సాధించాము. ఆ సమయంలో రోహిత్‌ అఖరి రెండు ఓవర్లలో 27 పరుగులు సాధించడంతో.. మా స్కోర్‌ బోర్డ్‌ 157 పరుగులకు చేరింది. దీంతో 158 పరుగులు చేధించడం పాక్‌ కష్టంగా మారిందిని అతడు తెలిపాడు. కాగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్‌ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు.
చదవండిIND VS AUS: రోహిత్‌ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్‌ గవాస్కర్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)