amp pages | Sakshi

Shane Warne: ‘నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది’

Published on Mon, 03/21/2022 - 08:08

‘‘నా గుండె ముక్కలవుతోంది. నొప్పితో విలవిల్లాడుతోంది. షేన్‌ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడం బాధను రెట్టింపు చేస్తోంది. గత రాత్రి షూట్‌ వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోతున్నా. ఈ ఫొటోలు మా ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా శ్రీలంకలో తీసుకున్నవి.

అప్పుడు మా పిల్లలంతా మాతోనే ఉన్నారు. అవి సంతోషకర క్షణాలు. తను వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ మాజీ ప్రేయసి ఎలిజబెత్‌ హర్లే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కాగా ఆసీస్‌ స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ మార్చి 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 20న అతడి భౌతిక కాయానికి ఆస్ట్రేలియాలో అంత్యక్రియలు(ప్రైవేట్‌ ప్యునరల్‌) నిర్వహించారు. అత్యంత ఆప్తుల నడుమ అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

అయితే, షూటింగ్‌ కారణంగా వార్న్‌ మాజీ ప్రేయసి, నటి ఎలిజబెత్‌ ఇందులో భాగం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమె భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశారు. తన నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోలను పంచుకుంటూ వార్న్‌ కడసారి చూపునకు నోచుకోలేదంటూ ఉద్వేగానికి లోనయ్యారు. భౌతికంగా వార్న్‌ దూరమైనా అతడి జ్ఞాపకాలు చిరకాలం నిలిచి ఉంటాయని పేర్కొన్నారు.

కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన వార్న్‌, ఎలిజబెత్‌ 2011 సెప్టెంబరులో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కానీ, రెండేళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2013లో ఈ జంట విడిపోయింది. ఇక వార్న్‌ సంతానం విషయానికొస్తే.. భార్య సిమోనే కాలన్‌తో అతడు ముగ్గురు పిల్లలు కలిగారు. వీరిద్దరు 2005లో విడిపోయారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)