amp pages | Sakshi

గ్లోబల్‌ మెంటార్‌గా ప్రకటించిన లక్నో.. గుడ్‌ బై చెప్పానన్న గంభీర్‌! పోస్ట్‌ వైరల్‌

Published on Wed, 11/22/2023 - 15:27

IPL 2024- KKR- Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఉద్దేశించి భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు. ఎల్‌ఎస్‌జీతో తన బంధం ముగిసిందని.. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. 

ఈ మేరకు.. ‘‘లక్నో సూపర్‌ జెయింట్స్‌తో కొనసాగిన నా అద్భుత ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నా. జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరు చూపిన ప్రేమ, ఆప్యాయతలు నా ఈ ప్రయాణాన్ని మధుర జ్ఞాపకంగా మార్చాయి.

తన స్ఫూర్తిదాయక నాయకత్వంలో మమ్మల్ని ముందుకు నడిపిన డాక్టర్‌ సంజీవ్‌ గోయెంకాకు ధన్యవాదాలు. నేను అనుకున్న ప్రణాళికలు అమలు చేసేందుకు నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచారు.

భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని అద్భుతాలు చేయగలదు. ఎల్‌ఎస్‌జీ అభిమానులను గర్వపడేలా చేయడం ఖాయం. ఎల్‌ఎస్‌జీ సైన్యానికి ఆల్‌ ది వెరీ బెస్ట్‌’’ అని గంభీర్‌ ఎక్స్‌ వేదికగా లక్నో ఫ్రాంఛైజీకి వీడ్కోలు చెప్పినట్లు ప్రకటించాడు.

అదే విధంగా.. తాను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తిరిగి చేతులు కలుపుతున్నట్లు గంభీర్‌ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘నేను తిరిగి వచ్చేశా.. ఆకలి మీదున్నా.. నా నంబర్‌ 23.. అమీ కేకేఆర్‌’’ అంటూ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు.

గ్లోబల్‌ మెంటార్‌ను చేసిన లక్నో ఫ్రాంఛైజీ.. కానీ
కాగా ఐపీఎల్‌-2024 నేపథ్యంలో ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు పాత బంధాలకు స్వస్తి పలుకుతున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ సంజయ్‌ బంగర్‌కు గుడ్‌బై చెప్పి.. అతడి స్థానంలో ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా నియమించింది.

రాజస్తాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీలు కూడా తమ కోచ్‌లను మార్చాయి. ఈ క్రమంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మాత్రం.. గంభీర్‌ను కొనసాగిస్తున్నట్లు సెప్టెంబరు 9న ప్రకటన విడుదల చేసింది.

అంతేకాదు ఈ మాజీ ఓపెనర్‌ను గ్లోబల్‌ మెంటార్‌గా ప్రమోట్‌ చేసినట్లు వెల్లడించింది. కానీ.. ఇంతలోనే గంభీర్‌ ఇలాంటి ప్రకటన చేయడం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్నో యాజమాన్యం కావాలనే గౌతీని తొలగించిందని కొందరు.. కేకేఆర్‌తో చేరేందుకు అతడు కావాలనే ఎల్‌ఎస్‌జీకి గుడ్‌బై చెప్పాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇక గంభీర్‌ హుందాగా చేసిన పోస్ట్‌పై స్పందించిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ‘‘మీతో రెండేళ్లు అద్భుతంగా గడిచాయి లెజెండ్‌. ఆల్‌ ది బెస్ట్‌’’ అని ట్వీట్‌ చేయడం విశేషం. కాగా కేకేఆర్‌ కెప్టెన్‌గా గంభీర్‌ రెండుసార్లు(2012, 2014) ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఇక గౌతీ తిరిగి రావడంపై కేకేఆర్‌ సహ యజమాని షారుక్‌ ఖాన్‌ తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం?

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా అభిమానుల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)