amp pages | Sakshi

BAN Vs SL:నేనేమీ పొలార్డ్‌ లేదా రస్సెల్‌ కాదు.. కానీ!

Published on Mon, 05/24/2021 - 07:39

ఢాకా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 33 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (84; 4 ఫోర్లు, సిక్స్‌), మహ్ముదుల్లా (54; 2 ఫోర్లు, సిక్స్‌), తమీమ్‌ ఇక్బాల్‌ (52; 6 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 48.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మిరాజ్‌ (4/30), ముస్తఫిజుర్‌ (3/34) లంకను దెబ్బతీశారు.

ఇక అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ముష్ఫికర్‌ రహీమ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ అంత ఈజీ వికెట్‌ కాదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయాం. అయితే, మేం నిలదొక్కుకున్నాం. తమీమ్‌, రియాద్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఇక నా విషయానికి వస్తే.. భారీ షాట్లు ఆడేందుకు నేనేమీ పొలార్డ్‌ లేదా రస్సెల్‌ను కాదు. నా బలాలు ఏంటో నాకు తెలుసు. ముఖ్యంగా వికెట్‌ కాపాడుకుంటూ, పరుగులు రాబట్టాలని ఆలోచించాను. అదే చేశాను. నిజంగా ఇదొక మంచి  గేమ్‌. మిరాజ్‌, ముస్తఫిజుర్‌, సైఫుద్దీన్‌ కూడా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: అతని శతక దాహం ఇంగ్లండ్‌ పర్యటనలో తీరుతుంది..

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌