amp pages | Sakshi

కోమాలోనే సౌతాఫ్రికా యువ క్రికెటర్‌.. అండగా నిలబడిన క్రికెట్‌ బోర్డు

Published on Fri, 06/03/2022 - 09:20

గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలోకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు(క్రికెట్‌ సౌతాఫ్రికా) అండగా నిలబడింది. ఖుమాలో కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బోర్డు తన పెద్ద మనసు చాటుకుంది. ''యూకేలో దుండగుల చేతిలో గాయపడిన మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అతని కుటుంబసభ్యులకు మా అండ ఎప్పటికి ఉంటుంది.'' అని పేర్కొంది.


కాగా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ఇప్పటికి కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం యూకేలోని సౌత్‌మెడ్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు బుధవారం మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. బ్లడ్‌ప్రెషర్‌ కూడా ఎక్కువగా ఉందన్నారు. దీంతో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కాగా మే29(ఆదివారం) తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.


కాగా ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్‌-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, రెండు లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)