amp pages | Sakshi

కామన్‌వెల్త్‌లో భారత్‌ ​జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం

Published on Tue, 08/02/2022 - 08:57

బర్మింగహమ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్‌.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్‌ కౌర్‌ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్‌ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్‌ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్‌ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి.

కాగా స్నాచ్‌ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్‌ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేసింది. ఇక క్లీన్‌ అండ్‌ జెర్క్‌ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్‌ కౌర్‌.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది.

చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్‌ గురి.. అసలు లాన్‌ బౌల్స్‌ అంటే ఏమిటి?

Videos

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)