amp pages | Sakshi

షఫాలీ, లానింగ్‌ ధనాధన్‌

Published on Mon, 03/06/2023 - 01:28

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో పరుగుల హోరెత్తుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. ఢిలీక్యాపిటల్స్‌ ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) చెలరేగారు. బౌలింగ్‌లో తారా నోరిస్‌ (5/29) నిప్పులు చెరగడంతో ఢిల్లీ 60 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై జయభేరి మోగించింది.

ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీస్కోరు చేసింది. మహిళల టి20 క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు లానింగ్, షఫాలీ తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. షఫాలీ 31 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు)... లానింగ్‌ 30 బంతుల్లో (10 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆఖర్లో మరిజన్‌ కాప్‌ (17 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా (15 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.

అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. కెప్టెన్, ఓపెనర్‌ స్మృతి మంధాన (23 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఎలీస్‌ పెర్రీ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు), హీథెర్‌నైట్‌ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. తారా నోరిస్‌ 5, అలైస్‌ క్యాప్సీ 2 వికెట్లు తీశారు.  

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (బి) హీథెర్‌నైట్‌ 72; షఫాలీ (సి) రిచా (బి) హీథెర్‌నైట్‌ 84; మరిజన్‌ కాప్‌ (నాటౌట్‌) 39; జెమీమా (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223.
వికెట్ల పతనం: 1–162, 2–163. బౌలింగ్‌: రేణుక సింగ్‌ 3–0–24–0, మేగన్‌ 4–0–45–0, ప్రీతి 4–0– 35–0, పెర్రీ 3–0–29–0, సోఫీ డివైన్‌ 1–0–20–0, శోభన 2–0–29–0, హీథెర్‌నైట్‌ 3–0–40–2. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి) శిఖా (బి) క్యాప్సీ 35; సోఫీ డివైన్‌ (సి) షఫాలీ (బి) క్యాప్సీ 14; పెర్రీ (బి) నోరిస్‌ 31; దిశ (సి) క్యాప్సీ (బి) నోరిస్‌ 9; రిచా (సి) రాధ (బి) నోరిస్‌ 2; హీథెర్‌నైట్‌ (సి) లానింగ్‌ (బి) నోరిస్‌ 34; కనిక (సి) షఫాలీ (బి) నోరిస్‌ 0; శోభన (సి) రాధ (బి) శిఖా 2; మేగన్‌ (నాటౌట్‌) 30; ప్రీతి బోస్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1–41, 2–56, 3–89, 4–90, 5–93, 6–93, 7–96, 8–150. బౌలింగ్‌: శిఖా పాండే 4–0–35–1, మరిజన్‌ కాప్‌ 4–0–36–0, జొనసెన్‌ 4–0–28–0, అలైస్‌ క్యాప్సీ 2–0–10–2, రాధ యాదవ్‌ 2–0–24–0, తారా నోరిస్‌ 4–0–29–5.  

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?