amp pages | Sakshi

దినేశ్‌ కార్తీక్‌కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఇప్పుడు..!

Published on Sat, 07/09/2022 - 11:02

Dinesh Karthik: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 సందర్భంగా టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు వింత అనుభవం ఎదురైంది. తన వన్డే డెబ్యూ మ్యాచ్‌లో ప్రత్యర్ధి ఆటగాడిగా ఉన్న అలెక్స్‌ వార్ఫ్‌ (ఇంగ్లండ్‌) ఈ మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌గా బరిలో నిలిచాడు. 2004లో డీకే ( నాడు 19 ఏళ్లు) వన్డే అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో (లార్డ్స్‌) అలెక్స్‌ (29) ఇంగ్లండ్‌ తుది జట్టులో బౌలర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ డీకేకు తొలి మ్యాచ్‌ అయితే అలెక్స్‌కు వన్డేల్లో మూడవది. ఆ మ్యాచ్‌లో డీకే.. అలెక్స్‌ క్యాచ్‌ కూడా పట్టాడు​. 

ఈ ఆసక్తికర పరిణామం నేపథ్యంలో నెటిజన్లు డీకేపై సెటైర్లు వేస్తున్నారు. క్లాస్‌ మేట్‌ టీచర్‌ అయితే ఎలా ఉంటదో.. ప్రస్తుతం డీకే పరిస్థితి అలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డీకే నిత్య యువకుడు, పోరాట యోధుడు, పడి లేచని కెరటం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంగ్లండ్ తరఫున 13 వన్డేల్లో 18 వికెట్లు పడగొట్టిన అలెక్స్.. 2011లో ఫీల్డ్ అంపైర్‌గా మారాడు. అలెక్స్‌ ఇప్పటి వరకు 2 టెస్టులు, 8 వన్డేలు, 27 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు.

కాగా, దినేశ్‌ కార్తీక్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వారంతా ప్రస్తుతం ఆటకు గుడ్‌బై చెప్పి వివిధ హోదాల్లో ఉన్నారు. డీకే సమకాలీకుల్లో చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా, అంపైర్లుగా వ్యవహరిస్తుంటే డీకే మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. సరైన అవకాశాలే లేక మధ్యలో కొద్దికాలం పాటు కామెంటేటర్‌గా వ్యవహరించిన డీకే.. ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 
చదవండి: సిరీస్‌ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష!
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)