amp pages | Sakshi

విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్‌ తయారు చేస్తారా?

Published on Thu, 03/09/2023 - 18:32

టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్ మంజ్రేకర్‌ అహ్మదాబాద్‌ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన నాలుగో టెస్టు పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌ ట్రాక్‌లా కనిపిస్తుంది. తొలిరోజు ఆటలో టీమిండియా బౌలర్లు నానాకష్టాలు పడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 104 పరుగులు నాటౌట్‌ సెంచరీతో కదం తొక్కగా.. కామెరాన్‌ గ్రీన్‌ 49 పరుగులు క్రీజులో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సంజయ్‌ మంజ్రేకర్‌ పిచ్‌పై ఆసక్తికరంగా స్పందించాడు. ''అహ్మదాబాద్‌ పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. మూడు సెషన్‌లు కలిపి టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడంపై విమర్శలు రావడంతో బయపడిన క్యురేటర్‌లు మరీ ఇలా 70, 80ల  కాలం నాటి పిచ్‌లను తయారు చేస్తారనుకోలేదు.

బ్యాటింగ్‌కు అనుకూలంగా జీవం లేని పిచ్‌పై షమీ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జడేజా పర్వాలేదనిపించినా.. అక్షర్‌, అశ్విన్‌లు మాత్రం వికెట్లు పడగొట్టలేకపోయారు. అయితే రెండోరోజు ఆటలో పిచ్‌లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందేమో.'' అని పేర్కొన్నాడు.

మంజ్రేకర్‌ వ్యాఖ్యలపై మరో కామెంటేటర్‌ మాథ్యూ హెడెన్‌ స్పందిస్తూ.. టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌కు ఇది సరైన పిచ్‌లా అనిపిస్తుంది. తొలిరోజే అన్ని జరగాలంటే కుదరదు. రానున్న రోజుల్లో​ పిచ్‌ ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీమిండియా స్పిన్‌ త్రయం వికెట్లు తీయలేకపోయినప్పటికి తమ ఇంపాక్ట్‌ను చూపించారు. జడేజాతో పాటు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు తమ స్పిన్‌తో రెండో రోజు ఆసీస్‌ను తిప్పేస్తారేమో.'' అంటూ తెలిపాడు.

Videos

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

Photos

+5

ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)