amp pages | Sakshi

గుండె బద్దలైంది.. నిన్ను మించిన నాయకుడు లేడు! ఎప్పటికీ నీవు మా కెప్టెన్‌వే

Published on Sat, 12/16/2023 - 09:17

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంతవిజయవంతమైన జట్టు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ముంబై ఇండియన్సే. సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ వంటి దిగ్గజాల సారథ్యంలో కూడా గుర్తింపురాని ముంబై ఇండియన్స్‌.. ఒకరి నాయకత్వంలో మాత్రం సంచలనాలు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను ముద్దాడి.. తనకంటూ ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకుంది.

దీనికి కారణం ఒకే ఒక్కడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే ముంబైను ఛాంపియన్స్‌గా నిలిపి.. 5 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఘనత అతడిది. తన వ్యూహాలతో ప్రత్యర్ధి జట్లను చిత్తు చేసే మాస్టర్‌మైండ్‌ అతడిది. తన హావభావాలతో అభిమానులను అకట్టుకునే నైజం అతడిది. ఇకపై ఐపీఎల్‌లో అతడి నాయకత్వాన్ని మరి చూడలేం.

ఒక మాజీ కెప్టెన్‌గా, సాధరణ ఆటగాడి గానే చూడా బోతున్నాం. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఈ ఉపోద్ఘాతం అంత ఎవరు కోసమే. అవును మీరు అనుకుంటుంది నిజమే. ఇదింతా టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోసమే.

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ అభిమానుల గుండె బద్దలయ్యే నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి హిట్‌మ్యాన్‌ను ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తప్పించింది. అతడి స్ధానంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌గా సారథిగా రోహిత్‌ శర్మ జర్నీపై ఓ లుక్కేద్దాం.

2013లో తొలిసారి..
ఐపీఎల్‌-2011 సీజన్‌ వేలంలో రూ. 13 కోట్లకు రోహిత్‌ శర్మను ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే 2013లో తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం అప్పగించింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి హిట్‌మ్యాన్‌ జట్టును విజయ పథంలో   నడిపించాడు. నాయకుడిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా అందరిని అకట్టుకున్నాడు. 

ఈ క్రమంలో మొత్తంగా 11 సీజన్‌లలో సారథ్యం వహించి అందులో 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ మొత్తంగా ముంబై ఇండియన్స్‌ జట్టు తరఫున 163 మ్యాచులకు సారధ్యం వహించగా.. 91 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 68 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 

గుండె బద్దలైంది..
ఇక కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదిగా ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టు కోసం ఎంతో కష్టపడి.. అద్భుతమైన ఫలితాలు అందించిన వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఓ యూజర్‌ స్పందిస్తూ.. 'నా గుండె బద్దలైంది.. ఏదేమైనప్పటికీ నీవు మా కెప్టెన్‌వే' అంటూ కామెంట్‌ చేశారు. కాగా రోహిత్‌ కెప్టెన్సీ తప్పించిన తర్వాత ముంబైకు బిగ్‌ షాక్‌ తగిలింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను 1.5 లక్షల మంది ఆన్‌ ఫాలో చేశారు.
చదవండి: IND vs SA: అర్ష్‌దీప్‌పై కోపంతో ఊగిపోయిన సూర్య.. వేలు చూపిస్తూ! వీడియో వైరల్‌

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)