amp pages | Sakshi

సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్‌.. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ ఓటమి

Published on Sun, 12/11/2022 - 08:22

ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ తమ జోరును కొనసాగిస్తుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ అడుగు పెట్టింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన యూరప్‌ జట్టు తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇంగ్లీష్‌ జట్టు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ.. ఓటమి నుంచి మాత్రం గట్టుక్కలేకపోయింది. మ్యాచ్‌ తొలి ఆర్ధబాగంలో ఫ్రాన్స్‌ ఆటగాడు అరెలియన్‌ చౌమెనీ అద్భుతమైన కిక్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు.

దీంతో ఫ్రాన్స్‌ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడినప్పటికీ గోల్‌ మాత్రం సాధించలేకపోయాయి. ఇక సెకెండ్‌ హాఫ్‌లో బ్రిటన్‌ ఆటగాడు హారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి. ఈ క్రమంలో ఇరు జట్ల శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

ఇటువంటి సమయంలో 78 నిమిషాల వద్ద ఫ్రాన్స్‌ ఆటగాడు ఒలివర్‌ గిరౌడ్‌ సంచలన గోల్‌తో తమ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత 84 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్‌ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో 2-1 తేడాతో ఓటమిపాలైన ఇంగ్లీష్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇ​క ఫ్రాన్స్‌ సెమీస్‌లో ఆఫ్రికా జట్టు మొరాకోతో తలపడనుంది.
చదవండిIND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌