amp pages | Sakshi

అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్‌పై నిషేధం

Published on Wed, 04/14/2021 - 18:22

దుబాయ్‌: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఐసీసీ అవినీతి నిరోధ‌క కోడ్‌ను ఐదుసార్లు ఉల్లంఘించిన‌ట్లు స్ట్రీక్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొద‌ట్లో ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన స్ట్రీక్‌.. తాజాగా వాటిని అంగీక‌రించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్‌ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన త‌ర్వాత కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన హీత్ స్ట్రీక్‌ ఆ స‌మ‌యంలోనే అవినీతికి పాల్ప‌డిన‌ట్లు విచార‌ణలో తేలింది.

2017, 2018ల‌లో వివిధ మ్యాచ్‌ల సంద‌ర్భంగా అత‌డు త‌న టీమ్‌లోని ప్లేయ‌ర్స్ ద‌గ్గ‌రికి బుకీల‌ను అనుమ‌తించ‌డాన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇందులో కొన్ని అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండ‌గా.. ఐపీఎల్‌, బీపీఎల్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ ప్రిమియ‌ర్ లీగ్‌ల‌లోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫ‌లితాల‌పై అవి ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌ని ఐసీసీ అవినీతి నిరోధ‌క శాఖ స్ప‌ష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్‌, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధ‌క కౌన్సిలింగ్ సెష‌న్ల‌కు హాజ‌రైన స్ట్రీక్ ఇలా చేయ‌డం బాధాక‌ర‌మ‌ని ఐసీసీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అలెక్స్ మార్ష‌ల్ అన్నారు.
చదవండి: మ్యాచ్‌ ఓడినందుకు షారుఖ్‌ క్షమాపణ.. స్పందించిన రసెల్‌

సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్‌ కెప్టెన్‌‌

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)