amp pages | Sakshi

Hockey Men Junior World Cup: యువ భారత్‌ జోరు...

Published on Thu, 12/02/2021 - 05:18

భువనేశ్వర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో టైటిల్‌ నిలబెట్టుకునేందుకు మరో అడుగు ముందుకు వేసింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జూనియర్‌ జట్టు 1–0తో బెల్జియంపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను శారదానంద్‌ తివారి సాధించాడు. ఆట 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను శారదానంద్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

దీంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీన్ని తుదిదాకా కాపాడుకొని విజయం సాధించింది. మ్యాచ్‌ మొదలవగానే బెల్జియం దూకుడు పెంచింది. పదేపదే భారత రక్షణపంక్తిని ఛేదించుకుంటూ దాడులకు పదునుపెట్టింది. అయితే గోల్‌కీపర్‌ పవన్‌ చక్కని సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాల్ని నీరుగార్చాడు.

ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో జర్మనీ పెనాల్టీ షూటౌట్‌లో 3–1తో స్పెయిన్‌పై, అర్జెంటీనా 2–1 తో నెదర్లాండ్స్‌పై, ఫ్రాన్స్‌ 4–0తో మలేసియాపై గెలిచాయి. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో అర్జెంటీనా తో ఫ్రాన్స్‌; జర్మనీతో భారత్‌ తలపడతాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)