amp pages | Sakshi

ఆ షాట్లను బ్యాన్‌ చేయండి.. 

Published on Sun, 12/06/2020 - 14:58

సిడ్నీ; క్రికెట్‌లో స్విచ్‌ హిట్‌ షాట్లకు చరమగీతం పాడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని రోజులుగా స్విచ్‌ హిట్‌ షాట్లపై పదే పదే వార్తలో  నిలుస్తున్న చాపెల్‌.. ఒకవేళ ఆ షాట్లు ఆడితే దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాలని సూచించాడు. ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ తరహా షాట్లతో టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్విచ్‌ షాట్‌ అనేది బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది సరికాదని ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు రాసిన ఒక కాలమ్‌లో స్విచ్‌ హిట్‌పై ఇయాన్‌ చాపెల్‌ ధ్వజమెత్తాడు. (పృథ్వీ షా, గిల్‌ డకౌట్లు.. రహానే  శతకం)

‘స్విచ్‌ హిట్టర్లకు ఇది చాలా ప‍్రయోజనం చేకూరుస్తుంది. ఆ షాట్‌ను బ్యాన్‌ చేయడమే మార్గం. లేకపోతే ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్రకటించాలి’ అని పేర్కొన్నాడు. ఇది ఫీల్డ్‌ అంపైర్లకు అదనపు పనిగా మారిపోతుందని అంతర్జాతీయ మాజీ అంపైర్‌ సైమన్‌ టైఫల్‌ పేర్కొన్నాడు.  అది స్విచ్‌ హిట్‌ అవునా.. కాదా అనే విషయాన్ని అంచనా వేయడం అంపైర్లకు కొన్ని సందర్భాల్లో కఠినంగా మారిపోతుందన్నాడు.  అయితే దీనితో చాపెల్‌ విభేదించాడు. ఇది కాస్త కఠినతరమే అయినా తప్పదన్నాడు. స్వేర్‌ లెగ్‌ అంపైర్‌ ఎప్పుడూ బ్యాట్స్‌మన్‌ కాళ్ల కదిలికలను చూస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని వారికే అప్పచెప్పాలన్నాడు. స్టంపింగ్‌  విషయాన్ని లెగ్‌ అంపైర్‌ ఎలా చూస్తాడో అలానే స్విచ్‌ హిట్ల పని కూడా వారికే అప్పచెబితే బాగుంటుందన్నాడు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌