amp pages | Sakshi

IND Vs IRE: గంటకు 208 కి.మీ. వేగం.. అక్తర్‌ రికార్డు బద్దలు కొట్టిన భువీ?

Published on Mon, 06/27/2022 - 12:24

India vs Ireland T20 Series: ఐర్లాండ్‌తో డబ్లిన్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదటి ఓవర్‌ ఐదో బంతికే ఐరిష్‌ కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీని అవుట్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ వైస్‌ కెప్టెన్‌ 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.

తద్వారా హార్దిక్‌ పాండ్యా సేన ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా భువీ బౌలింగ్‌ చేస్తున్నపుడు స్పీడోమీటర్‌ రెండుసార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో అతడు బంతి విసిరినట్లు చూపడం గమనార్హం. 

ఐర్లాండ్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌కు భువీ వేసిన బాల్‌ 201 Km/h, అదే విధంగా బల్బిర్నీకి 208 201 Km/​h‍ వేగంతో బంతిని విసిరినట్లు చూపింది. నిజానికి అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌(161.3 km/h) పేరిట ఉంది.

అయితే, భువీ నిజంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్‌ ఇలా చూపిందా అన్న విషయం అంతుబట్టక నెటిజన్లు తికమకపడుతున్నారు. అదే సమయంలో.. భువీని కొనియాడుతూ.. ‘‘తప్పో.. ఒప్పో.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇంతకీ షోయబ్‌ అక్తర్‌’’ ఎవరూ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా స్పీడోమీటర్‌లో చూపింది విండ్‌స్పీడ్‌రా బాబూ అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. 

ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ స్కోర్లు:
టాస్‌- భారత్‌- బౌలింగ్‌, వర్షం కారణంగా మ్యాచ్‌ 12 ఓవర్లకు కుదింపు
ఐర్లాండ్‌ స్కోరు: 108/4 (12)
టీమిండియా స్కోరు: 111/3 (9.2)
విజేత: హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చదవండి: IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)