amp pages | Sakshi

అతడి ఎంపిక సరైంది.. భారత్‌కు ఇప్పుడు అలాంటి ఆటగాడు అవసరం!

Published on Fri, 06/24/2022 - 15:12

India Vs Ireland T20I Series: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో దీపక్‌ హుడాను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో భారత్‌కు ఇప్పుడు హుడా వంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2022లో అద్భుతంగా ఆకట్టుకున్న అతడు.. టీమిండియా తరఫున ఏ మేరకు రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు. 

అద్భుతంగా రాణించినా!
కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు దీపక్‌ హుడా. అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ 14 ఇన్నింగ్స్‌లో కలిపి 451 పరుగులు చేశాడు.

ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో కీలకంగా వ్యవహరించి లక్నో ప్లే ఆఫ్స్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో హుడాకు జాతీయ జట్టులో చోటు దక్కుతుందని భావించినా మొండిచేయి ఎదురైంది. అయితే, కీలక ఆటగాళ్లు లేకుండా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్‌లో అతడు స్థానం సంపాదించుకున్నాడు.

భారత్‌కు ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది!
ఈ నేపథ్యంలో సంజయ్‌ మంజ్రేకర్‌ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐర్లాండ్‌తో సిరీస్‌లో హుడా రాణిస్తాడనే అనుకుంటున్నా. ఐపీఎల్‌లో దీపక్‌ హుడా తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నిజానికి లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కష్టం.

అయితే, హుడా ఐపీఎల్‌లో ఈ కఠినతరమైన పనిని ఎంతో సులువుగా చేశాడు. టీమిండియాకు ఇప్పుడు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. ఐపీఎల్‌లోనే కాదు భారత్‌ తరఫున కూడా అతడు అత్యుత్తమంగా రాణిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 26, 28 తేదీల్లో భారత్‌- ఐర్లాండ్‌ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

చదవండి: ఒకప్పుడు ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌లో సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులు అమ్ముతూ! డబ్బు మీద ఆశలేదు కానీ!
India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్‌ టీ 20 సిరీస్‌.. ఇరు జట్లు, షెడ్యూల్‌.. పూర్తి వివరాలు!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)