amp pages | Sakshi

సంజూ బద్దకస్తుడు.. అసలు అలా ఎందుకు చేశాడు?

Published on Sat, 07/31/2021 - 20:53

ఇస్లామాబాద్‌: టీమిండియా వికెట్‌ కీపర్‌- బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ ఆట తీరుపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్‌ భట్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బద్దకస్తుడని, శ్రీలంక పర్యటనలో తను అవుట్‌ అయిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నాడు. లంక బౌలర్‌ వహిందు హసరంగ మాయాజాలంలో పడి తేలికగా వికెట్‌ సమర్పించుకున్నాడని విమర్శించాడు. కాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేతో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్‌ ఆ మ్యాచ్‌లో 46 పరుగులతో రాణించాడు. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 34 (27, 7,0) పరుగులు మాత్రమే చేశాడు. 

తొలి, చివరి టీ20లో లంక బౌలర్‌ హసరంగ బౌలింగ్‌లోనే సంజూ పెవిలియన్‌ చేరడం గమనార్హం. అది కూడా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముఖ్యంగా మూడో టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ఆటగాడు సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ... ‘‘ నాకెందుకో సంజూ శాంసన్‌ బద్దకస్తుడైన బ్యాట్స్‌మెన్‌ అనిపిస్తుంది. ఒక బౌలర్‌ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినపుడు.. తెలివిగా తప్పించుకోవాలి గానీ, అతడి వలకు చిక్కడం దేనికి? సంజూ శాంసన్‌ టెక్నిక్‌ను అంచనా వేసిన హసరంగ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 

నిజానికి, జట్టులో ఉంది ఐదుగురు బ్యాట్స్‌మెన్లు. అందులో తను కూడా ఒకడని తెలుసు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ తను ఈ విషయాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అసలు అవుట్‌ కాకుండా ఉండేందుకు సంజూ ప్రయత్నించినట్లుగా ఏ కోశానా కనిపించలేదు’’ అని విమర్శించాడు. కాగా కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకడంతో ప్రధాన ఆటగాళ్లలో చాలా మంది అందుబాటులో లేకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)