amp pages | Sakshi

India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్‌.. నలుగురు ఆటగాళ్లు దూరం!

Published on Wed, 12/08/2021 - 11:08

Ind Vs Sa: These 4 Indian Players Doubtful For SA Tour, Cause Of Injuries దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే సమయం ఆసన్నమైన వేళ టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. నలుగురు కీలక ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వీరితో పాటు అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ సైతం సౌతాఫ్రికా టూర్‌ మిస్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌ మ్యాచ్‌లో జడేజా కుడి ముంజేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంజేయి వాపు కారణంగా జడేజా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే, గాయం తీవ్రతరం కావడంతో పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. 

ఒకవేళ జడేజా సర్జరీకి వెళ్లాల్సి వస్తే అతడు సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న అక్షర్‌ పటేల్‌ సైతం స్ట్రెస్‌ రియాక్షన్‌(కీళ్ల నొప్పి) కారణంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం అతడు దక్షిణాఫ్రికా టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయం తేలనుంది. 

చదవండి: IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్‌ కిషన్‌, హనుమ విహారి 

మరోవైపు పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న సీనియర్‌ సీమర్‌ ఇషాంత్‌ శర్మ సైతం జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే అతడి స్థానంలో ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ అందుబాటులో ఉండటంతో పెద్దగా సమస్యకాకపోవచ్చు. 

కానీ, ఒకవేళ జడేజా, అక్షర్‌ పటేల్‌ టూర్‌ మిస్‌ అయితే మాత్రం.. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు తోడుగా.. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అనధికార టెస్టులు ఆడుతున్న ఇండియా ఏ జట్టులోని షాబాజ్‌ నదీం, సౌరభ్‌ కుమార్‌ను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా... ముంబై టెస్టులో గిల్‌ మధ్య వేలికి గాయమైన నేపథ్యంలో అతడు కూడా జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఇలా టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న కారణంగా జట్టు ఎంపిక కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. 

చదవండి: Ind Vs Sa Test Seires: ప్రొటిస్‌ జట్టు ఇదే.. పాక్‌కు చుక్కలు చూపించిన బౌలర్‌ వచ్చేశాడు!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)