amp pages | Sakshi

మిల్లర్‌, డుసెన్‌ మెరుపులు.. తొలి టి20లో దక్షిణాఫ్రికా ఘన విజయం

Published on Thu, 06/09/2022 - 18:37

మిల్లర్‌, డుసెన్‌ మెరుపులు.. దక్షిణాఫ్రికా ఘన విజయం
టీమిండియాతో జరిగిన తొలి టి20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేవిడ్‌ మిల్లర్‌ 64*, వాండర్‌ డుసెన్‌ 75* పరుగులు చేసి జట్టును గెలిపించారు. అంతకముందు ప్రిటోరియస్‌ 29, డికాక్‌ 22 పరుగులు చేశారు. కాగా ఈ ఓటమితో టీమిండియా 12 వరుస విజయాల రికార్డుకు బ్రేక్‌ పడింది. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

మిల్లర్‌ దూకుడు.. లక్ష్యం దిశగా సౌతాఫ్రికా
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా చేధనలో దూకుడు కనబరుస్తుంది. ముఖ్యంగా ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. అతనికి వాండర్‌ డుసెన్‌ సహకరిస్తున్నాడు. ప్రస్తుతం మిల్లర్‌ 50, డుసెన్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా  3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

12 ఓవర్లలో సౌతాఫ్రికా 106/3
12 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. డుసెన్‌ 20, డేవిడ్‌ మిల్లర్‌ 19 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. అంతకముందు 22 పరుగులు చేసిన డికాక్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రిటోరియస్‌ క్లీన్‌బౌల్డ్‌​.. రెండో వికెట్‌​ కోల్పోయిన సౌతాఫ్రికా
61 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో రెండో బంతికి 29 పరుగులు చేసిన ప్రిటోరియస్‌ క్లీన్‌బౌల్డ్‌​అయ్యాడు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా(10) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. 

టీమిండియా భారీ స్కోరు.. సౌతాఫ్రికా టార్గెట్‌ 212
సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 76 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ 36, రిషబ్‌ పంత్‌ 29 పరుగులు చేశారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోర్ట్జే, పార్నెల్‌, ప్రిటోరియస్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

ఇషాన్‌ కిషన్‌(76) ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
ధాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌(76) కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో త్రిస్టన్‌ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అంతకముందు అదే ఓవర్లో వరుసగా 6,6,4,4తో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

ఇషాన్‌ కిషన్‌ ఫిప్టీ.. టీమిండియా 112/1
టీమిండియా ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అర్థసెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దాటిగా ఆడుతూ వచ్చిన ఇషాన్‌ 37 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి 112 పరుగులు చేసింది.

చెలరేగుతున్న ఇషాన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌
టీమిండియా బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేస్తున్నారు. ఇషాన్‌ 45 పరుగులతో, శ్రేయాస్‌ 24 పరుగులతో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 102 పరుగులు చేసింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రుతురాజ్‌(23) ఔట్‌
రుతురాజ్‌ గైక్వాడ్‌(23) రూపంలో టీమిండియా తొలి వికెట​ కోల్పోయింది. వేన్‌ పార్నెల్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి బవుమాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది.

ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు.. 6 ఓవర్లలో 51/0 
ప్రొటీస్‌తో మ్యాచ్‌ టీమిండియా ఓపెనర్లు శుభారంభం చేశారు. ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తున్న రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌ దాటికి టీమిండియా ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఇషాన్‌ 26, రుతురాజ్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3 ఓవర్లలో టీమిండియా 24/0
 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 9, రుతురాజ్‌ గైక్వాడ్‌ 9 పరుగులతో ఆడుతున్నారు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

ఐపీఎల్‌ 2022 ముగిసిన తర్వాత టీమిండియా సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌ రూపంలో తొలి ద్వైపాక్షిక సిరీస్‌ ఆడుతుంది. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టి20 ఆసక్తికరంగా మొదలైంది. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది.

రాబోయే టి20 ప్రపంచకప్‌ కోసం కాబోయే టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు భారత బోర్డు ఈ సీజన్‌లో ఎక్కువగా పొట్టి మ్యాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టు గట్టి ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టి20 క్రికెట్‌లో టీమిండియా గత 12 మ్యాచ్‌ల్లో విజయాలతో అజేయంగా ఉంది. ఈ వరుసలో అఫ్గానిస్తాన్, రొమేనియాలు 12 విజయాలతో ఉన్నాయి. తొలి టి20లో సఫారీని ఓడిస్తే 13 వరుస విజయాల జట్టుగా భారత్‌ రికార్డుల్లోకెక్కుతుంది.

దక్షిణాఫ్రికా తుది జట్టు: క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే

భారత్ తుది జట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్


 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)