amp pages | Sakshi

వైరల్‌: నేను సీఎస్‌కే గూండాను.. జాగ్రత్త!

Published on Tue, 04/20/2021 - 14:11

ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్‌తోనూ, బంతితోనూ ఇరగదీసే ఈ ఆల్‌రౌండర్‌.. తన అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ను రనౌట్‌ చేసిన జడ్డూ, క్రిస్‌ గేల్‌ను స్టన్నింగ్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు.

రాజస్తాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న జడ్డూ, మరో ఓపెనర్‌ మనన్‌ వోహ్రా ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టి అతడిని వెనక్కి పంపాడు. అంతేగాక శివమ్‌ దూబేను ఎల్బీడబ్ల్యూ చేసిన జడేజా, రియాన్‌ పరాగ్‌, క్రిస్‌ మోరిస్‌, జయదేవ్‌ ఉనద్కట్‌లను క్యాచ్‌ అవుట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ‌, రెండు వికెట్లు తీయడంతో పాటు నలుగురిని క్యాచ్‌ అవుట్‌ చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఉనద్కట్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టిన అనంతరం జడేజా సెలబ్రేట్‌ చేసుకున్న తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. నాలుగు క్యాచ్‌లు పట్టినందుకు గుర్తుగా నాలుగు వేళ్లు చూపిస్తూ, చిన్నగా స్టెప్పులేశాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన సీఎస్‌కే.. ‘‘2 వికెట్లు, 4 క్యాచ్‌లు.. జడ్డూ వెరీ గుడ్డూ’’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలి యాడ్‌ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సర్‌ జడేజా అంటే మాటలా మరి.. నేను సీఎస్‌కే గూండాను అంటూ జడ్డూ మనకేదో చెబుతున్నట్లు ఉంది కదా’’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా,  ‘‘చిన్నపిల్లాడిలా మైదానంలో పరుగులు పెడుతూ, చిరునవ్వులు చిందస్తూ అందరిలోనూ ఉత్సాహం నింపుతున్నాడు. తను నాలుగు వేళ్లు నాలుగు క్యాచ్‌లకు మాత్రమే సింబాలిక్‌ కాదు నాలుగో ట్రోఫీ ఆన్‌ ది వే’’ అంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అలా అయితే ధోని సేనదే టైటిల్‌: బ్రియన్‌ లారా
90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్‌..!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌