amp pages | Sakshi

Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా...

Published on Fri, 10/01/2021 - 07:24

Chris Gayle leaves Bio Bubble: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున మిగిలిన మ్యాచ్‌లనుంచి తప్పుకుంటున్నట్లు క్రిస్‌ గేల్‌ ప్రకటించాడు. సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ రావడంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్‌.. టి20 ప్రపంచకప్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్నానని అతను వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘గత కొన్ని నెలలుగా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బబుల్‌.. ఆ తర్వాత ఐపీఎల్‌ బబుల్‌లో ఉంటున్నాను. మానసిక పునరుత్తేజాన్నిపొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నాడు. 

ఇక ఈ సీజన్‌లో గేల్‌ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదనే చెప్పాలి. పేలవంగా ఆడిన అతడు.. పంజాబ్‌ తరఫున 10 ఇన్నింగ్స్‌లలో 193 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్‌లో గేల్‌ అత్యధిక స్కోరు 46 మాత్రమే!. కాగా గేల్‌ ప్రకటనపై స్పందించిన పంజాబ్‌ కింగ్స్‌ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తూ.. ఈ వెస్టిండీస్‌ క్రికెటర్‌కు విషెస్‌ తెలిపింది.

చదవండి: IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్‌ చరిత్రలో అత్యధికం
Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌