amp pages | Sakshi

మళ్లీ ఓడిన హైదరాబాద్‌

Published on Fri, 05/06/2022 - 05:43

ముంబై: ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ వెనుకబడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆల్‌రౌండ్‌ షోతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 92 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 67 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. నికోలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించాడు. ఖలీల్‌ అహ్మద్‌ 3, శార్దుల్‌ 2 వికెట్లు తీశారు.

వార్నర్, పావెల్‌... ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగితే హైదరాబాద్‌ ఖాతా (వికెట్‌) తెరిచింది. భువనేశ్వర్‌ తొలి ఓవర్‌ను మెయిడిన్‌ వికెట్‌గా తీశాడు. ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా ఢిల్లీ పుంజుకుంది. ఈ లీగ్‌లోనే ‘స్పీడ్‌స్టర్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌ను తొలి ఓవర్‌ నుంచే ఉతికేశారు. 4వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో వార్నర్‌ 21 పరుగులు పిండుకున్నాడు. మార్‌‡్ష (10) అవుటైనా... కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), వార్నర్‌ ఇద్దరు ఇన్నింగ్స్‌ను మెరుపులతో దారిలో పెట్టారు.

శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 9వ ఓవర్లో పంత్‌ 6, 6, 6, 4లతో జూలు విదిల్చాడు. కానీ చివరి బంతినీ బాదేసే పనిలో పంత్‌ వికెట్ల మీదికి ఆడుకున్నాడు. వికెట్‌ పడ్డా... ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. తర్వాత పావెల్, వార్నర్‌తో కలిసి విధ్వంసకరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదట వార్నర్‌ 34 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఓవర్లు దగ్గర పడుతుంటే పావెల్‌ బ్యాట్‌ మరింత రెచ్చిపోయింది. అతను 30 బంతుల్లోనే (6 సిక్సర్లు) ఫిఫ్టీ చేశాడు. ఉమ్రాన్‌ ఆఖరి ఓవర్లో (6, 0, 4, 4, 4, 1) పావెల్‌  వీరవిహారంతో వార్నర్‌ శతకం 8 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇద్దరు కలిసి 11 ఓవర్లలో అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు.  

పూరన్‌ మెరిపించినా...
కొండంత లక్ష్యం ఛేదించేందుకు దిగిన హైదరాబాద్‌ ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాపార్డర్‌ బ్యాటర్స్‌ అభిషేక్‌ శర్మ (7), విలియమ్సన్‌ (4), రాహుల్‌ త్రిపాఠి (22) నిరాశపరిచారు. మార్క్‌రమ్‌ (25 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), పూరన్‌ కాసేపు భారీ సిక్సర్లతో అలరించా రు. అయితే ఢిల్లీ బౌలర్లు ఖలీల్, శార్దుల్‌ ఎక్కడికక్కడ కళ్లెం వేశారు. పూరన్‌ 29 బంతుల్లోనే (1 ఫోర్, 5 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించగా... 18వ ఓవర్లో అతను కూడా ఔటవడంతో అక్కడే హైదరాబాద్‌ గెలుపుదారి మూసుకుపోయింది.  

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మన్‌దీప్‌ సింగ్‌ (సి) పూరన్‌ (బి) భువనేశ్వర్‌ 0; వార్నర్‌ (నాటౌట్‌) 92; మార్‌‡్ష (సి అండ్‌ బి) అబాట్‌ 10; పంత్‌ (బి) గోపాల్‌ 26; పావెల్‌ (నాటౌట్‌) 67; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 207.
వికెట్ల పతనం: 1–0, 2–37, 3–85.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–1–25–1, అబాట్‌ 4–0–47–1, ఉమ్రాన్‌ మాలిక్‌ 4–0–52–0, కార్తీక్‌ త్యాగి 4–0–37–0, శ్రేయస్‌ గోపాల్‌ 3–0–34–1, మార్క్‌రమ్‌ 1–0–11–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) కుల్దీప్‌ (బి) ఖలీల్‌ 7; విలియమ్సన్‌ (సి) పంత్‌ (బి) నోర్జే 4; త్రిపాఠి (సి) శార్దుల్‌ (బి) మార్‌‡్ష 22; మార్క్‌రమ్‌ (సి) కుల్దీప్‌ (బి) ఖలీల్‌ 42; పూరన్‌ (సి) పావెల్‌ (బి) శార్దుల్‌ 62; శశాంక్‌ (సి) నోర్జే (బి) శార్దుల్‌ 10; అబాట్‌ (సి) రిపాల్‌ (బి) ఖలీల్‌ 7; గోపాల్‌ (నాటౌట్‌) 9; త్యాగి (బి) కుల్దీప్‌ 7; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–8, 2–24, 3–37, 4–97, 5–134, 6–153, 7–165, 8–181.
బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–44–2, ఖలీల్‌ అహ్మద్‌ 4–0–30–3, నోర్జే 4–0–35–1, మార్‌‡్ష 4–0–36–1, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–40–1.  

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)