చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
ఐపీఎల్లో డ్వేన్ బ్రావో సరికొత్త చరిత్ర
Published on Thu, 03/31/2022 - 23:27
చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ఐపీఎల్లో చరిత్ర సృష్ఠించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దీపక్ హుడాను ఔట్ చేయడం ద్వారా బ్రావో ఐపీఎల్లో 171వ వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో కొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో బ్రావో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ (170) రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ఐపీఎల్ టాప్ ఐదు వికెట్ టేకర్స్ జాబితాను పరిశీలిస్తే.. బ్రావో(171 వికెట్లు), మలింగ(170 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత అమిత్ మిశ్రా (166), పియుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150)లు ఉన్నారు.
చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్కేకే సాధ్యం..
Bravoooo Legend! No. 1⃣ 👑#LSGvCSK #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/GdgVCL6Gg2
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2022
Tags