amp pages | Sakshi

ఆండర్సన్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!

Published on Sun, 08/28/2022 - 12:05

James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్‌  సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పేసర్లు జేమ్స్‌ ఆండర్సన్‌ (6/62), ఓలీ రాబిన్సన్‌ (5/91), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/61), బెన్‌ స్టోక్స్‌ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్‌ స్టోక్స్‌ (103), బెన్‌ ఫోక్స్‌ (113 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో  ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్‌ సైమన్‌ హార్మర్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా ఆండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్‌ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ పేరిట ఉండేది. 

మెక్‌గ్రాత్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్‌.. మెక్‌గ్రాత్‌ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్‌ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్‌ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో  దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్‌-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్‌ కెన్నింగ​్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా సెప్టెంబర్‌ 8న ప్రారంభమవుతుంది. 
చదవండి: జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)