amp pages | Sakshi

విజృంభించిన ఉనద్కత్‌.. ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్ర

Published on Thu, 12/01/2022 - 13:10

Vijay Hazare Trophy 2022 Saurashtra VS Karnataka: విజయ్‌ హజారే ట్రోఫీ 2022లో భాగంగా నిన్న (నవంబర్‌ 30) జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటకపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సౌరాష్ట్ర.. జయదేవ్‌ ఉనద్కత్‌ (4/26), ప్రేరక్‌ మన్కడ్‌ (2/34) విజృంభించడంతో కర్ణాటకను 171 పరుగులకే (49.1 ఓవర్లు) కుప్పకూల్చింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో సమర్థ్‌ (88) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

అనంతరం 172 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత కోలుకుని 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జే గోహిల్‌ (61) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్‌ వ్యాస్‌ (33), ప్రేరక్‌ మన్కడ్‌ (35), అర్పిత్‌ వసవద (25 నాటౌట్‌), చిరాగ్‌ జానీ (13 నాటౌట్‌) తలో చేయి  వేసి జట్టును గెలిపించారు. 

ఇదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు), అంకిత్‌ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో మహారాష్ట్ర జట్టు 12 పరుగుల తేడాతో అస్సాంపై విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన అస్సాం లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది.  రిషవ్‌ దాస్‌ (53), శివ్‌శం‍కర్‌ రాయ్‌ (78), స్వరూపం పుర్కాయస్తా (95) అర్ధశతకాలతో రాణించి, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన మహారాష్ట్ర రేపు (డిసెంబర్‌ 2) జరుగబోయే ఫైనల్లో తొలి సెమీస్‌ విన్నర్‌ సౌరాష్ట్రతో తలపడనుంది.      
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)