amp pages | Sakshi

'అదంతా మిస్‌ కమ్యూనికేషన్‌‌‌ వల్ల జరిగింది'

Published on Thu, 03/25/2021 - 12:15

పుణే: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో వేసుకున్న జెర్సీని గమనించారా!.. లేకపోతే ఈ వార్తను చదివేయండి. విషయంలోకి వెళితే.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వేసుకున్న జెర్సీపై పేరు, నెంబర్లు బ్లూ కలర్‌లో రాగా.. బెయిర్‌ స్టో వేసుకున్న జెర్సీపై మాత్రం అతని పేరు, నెంబర్‌ తెలుపు రంగులో ఉంది. వాస్తవానికి టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు ఈ జెర్సీలను ధరించింది. మ్యాచ్‌ విజయం అనంతరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ అంశాన్ని చర్చించాడు.


'నేను వేసుకున్న జెర్సీ  నా సహచరులు వేసుకున్న దాని కంటే కాస్త భిన్నంగా ఉంది. అయితే చిన్న మిస్‌ కమ్మునికేషన్‌ వల్ల ఈ పొరపాటు జరిగింది. టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు మేం వేసుకోబోయే జెర్సీలు ఇంగ్లండ్‌ నుంచి వచ్చాయి. అవన్నీ ప్యాక్‌ చేసి ఉండడంతో మ్యాచ​ సమయానికి ప్యాక్‌ విప్పి జెర్సీ వేసుకున్నా. కానీ పొరపాటున టీ20 జెర్సీకి ఉపయోగించిన కలర్‌నే నా వన్డే జెర్సీకి వాడినట్లున్నారు. అంతే తప్ప నేను స్పెషల్‌గా ఎలాంటి జెర్సీని ధరించలేదు. సింపుల్‌గా ఇది విషయం అంటూ' చెప్పుకొచ్చాడు.

ఇక తొలి వన్డేలో బెయిర్‌ స్టో విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం 66 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వం సం సృష్టించాడు. అతని దాటికి ఇంగ్లండ్‌ ఒక దశలో వికెట్లేమి కోల్పోకుండా 135 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ అనూహ్యంగా బెయిర్‌ స్టో అవుట్‌ కావడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరు రాణించకపోవడంతో ఇంగ్లండ్‌ జట్టు 66 పరుగులతో పరాజయం చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే పుణే వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండి:
సుందర్‌, బెయిర్‌ స్టో గొడవ.. అంపైర్‌ జోక్యం
ధోని భయ్యా.. నాకు ఎల్‌ సైజ్‌ జెర్సీ పంపు: జడేజా

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌